News March 20, 2024
ఘోరం: వివాహితను ప్రేమించాడని..

మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో అమానవీయ ఘటన జరిగింది. వివాహితను ప్రేమించాడని ఓ యువకుడితో కొందరు యూరిన్ తాగించారు. దారుణంగా కొట్టి నాలుకతో షూస్ నాకించారు. అంతటితో ఆగకుండా యువకుడికి సగం గుండు, మీసం తీయించారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన స్థానిక ఏఎస్పీ నితేశ్ భార్గవ బాధితుడి ఇంటికి వెళ్లగా అతడు అందుబాటులో లేడు. త్వరలోనే బాధితుడిని కలిసి నిందితులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
Similar News
News November 21, 2025
మత్స్యకారులకు అండగా వైసీపీ: జగన్

AP: మత్స్యకారులకు తమ పార్టీ అండగా ఉంటుందని YCP అధ్యక్షుడు జగన్ తెలిపారు. ‘సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు. వారి సంక్షేమం, సాధికారతే లక్ష్యంగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టాం. రూ.4,913 కోట్లు లబ్ధి చేకూర్చాం’ అని ట్వీట్ చేశారు.
News November 21, 2025
DoPTకి లేఖ రాసిన ACB

ఫార్ములా eరేస్ కేసు దర్యాప్తులో ACB స్పీడ్ పెంచింది. కేసులో A2గా ఉన్న సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ను ప్రాసిక్యూట్ చేయడానికి DoPT (డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) అనుమతి కోరింది. కేంద్ర సంస్థ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే అరవింద్ను విచారించి ఆయనపై చార్జిషీట్ దాఖలు చేయనుంది. IASలను విచారించాలంటే DoPT పర్మిషన్ ఉండాలి. అటు A1 KTRను విచారించేందుకు గవర్నర్ ఇప్పటికే అనుమతించడం తెలిసిందే.
News November 21, 2025
నీటి నిల్వ, సంరక్షణ చర్యలను మెచ్చిన కేంద్రం

AP: రాష్ట్రవ్యాప్తంగా డి.సీఎం పవన్ నేతృత్వంలో నీటి నిల్వ, సంరక్షణ కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని కేంద్రం గుర్తించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు జల్ శక్తి అవార్డులు వరించాయి. పంచాయతీ క్యాటగిరీలో ప్రథమ స్థానంలో మదనపల్లి మండలం, దుబ్బిగానిపల్లె, ద్వితీయ స్థానంలో ప్రకాశం(జి), పీసీ పల్లె(మం) మురుగమ్మి గ్రామం, జల్ సంచయ్-జన్ భాగీదారీలో దక్షిణ జోన్లో నెల్లూరు జిల్లాకు అవార్డు దక్కింది.


