News April 14, 2024
బీరు ప్రియులకు బ్యాడ్ న్యూస్
TG: రాష్ట్రంలోని మద్యం షాపుల్లో బీర్ల కొరత ఏర్పడింది. సరఫరా, విక్రయాల మధ్య అంతరం పెరగడంతో ఈ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. బ్రూవరీల యాజమాన్యాలకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో బెవరేజెస్ కార్పొరేషన్ విఫలం కావడంతో బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు సమాచారం. రాష్ట్రంలోని 6 బ్రూవరీల్లో రోజుకు 2.50 లక్షల కేసుల బీరు తయారు చేయొచ్చు. ప్రస్తుతం 1.50 లక్షల కేసుల బీరు మాత్రమే తయారవుతుండటంతో డిమాండ్ పెరిగింది.
Similar News
News November 6, 2024
త్రివిధ దళాల సెల్యూట్లలో తేడాలివే!
ఇండియన్ ఆర్మీ సెల్యూట్: అరచేతిని ఓపెన్ చేసి, వేళ్లన్నీ కలిపి, మధ్య వేలు దాదాపు హ్యాట్‌బ్యాండ్/కనుబొమ్మలను తాకుతుంది. (చేతిలో ఏ ఆయుధాలు లేవని చెప్పడం)
ఇండియన్ నేవీ సెల్యూట్: నుదిటికి 90డిగ్రీల కోణంలో అరచేతిని ఓపెన్ చేసి నేల వైపు చూపిస్తారు. (పనిలో చేతికి అంటిన గ్రీజు కనిపించకుండా)
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెల్యూట్: నేలకు 45డిగ్రీల కోణంలో అరచేతిని ఓపెన్ చేసి చేస్తారు.(ఆకాశంలోకి వెళతామనడానికి సూచిక)
News November 6, 2024
2024 US Elections: X కేంద్రంగా నకిలీ సమాచార వ్యాప్తి
అమెరికా ఎన్నికలపై ఎలాన్ మస్క్ చేసిన నకిలీ, తప్పుడు సమాచార ట్వీట్లకు Xలో ఈ ఏడాది 2 బిలియన్ల వ్యూస్ వచ్చినట్టు సెంటర్ ఫర్ కౌంటరింగ్ డిజిటల్ హేట్ అధ్యయనంలో తేలింది. కీలక రాష్ట్రాల్లో తప్పుడు సమాచార వ్యాప్తికి X కేంద్ర బిందువుగా పని చేసిందని ఆరోపించింది. మస్క్‌కు భారీ సంఖ్యలో ఉన్న ఫాలోవర్స్ వల్ల ఇది పెద్ద ఎత్తున ఇతరుల్ని ప్రభావితం చేయడానికి వీలు కల్పించిందని ఓ ప్రొఫెసర్ తెలిపారు.
News November 6, 2024
రక్షణ మంత్రిని తొలగించిన నెతన్యాహు
గాజాతో యుద్ధం వేళ ఇజ్రాయెల్ PM నెతన్యాహు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌ను తొలగించారు. ‘కొన్ని నెలలుగా విశ్వాసం సన్నగిల్లుతోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’ అని ఆయన ప్రకటించారు. గాలంట్ స్థానంలో ఫారిన్ మినిస్టర్ ఇజ్రాయెల్ కాజ్‌ను నియమించారు. FMగా గిడోన్ సార్ బాధ్యతలు చేపట్టారు. గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచే నెతన్యాహు, గాలంట్ మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.