News January 30, 2025
మందుబాబులకు బ్యాడ్ న్యూస్?

TG: మద్యం ప్రియుల కిక్కు దించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మద్యం ధరల పెంపునకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దీనిపై త్రిసభ్య కమిటీ నివేదిక ఇవ్వగా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. అధికారులు ఇటీవల ఈ అంశంపై చర్చించగా ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రీమియం బ్రాండ్స్, బీర్లపై 15 శాతం పెరిగే అవకాశముంది.
Similar News
News September 13, 2025
చైనాపై 50%-100% టారిఫ్స్ వేయండి: NATOకు ట్రంప్ లేఖ

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు చైనాపై 50%-100% టారిఫ్స్ విధించాలని <<7824953>>NATO<<>>కు ట్రంప్ లేఖ రాశారు. ‘NATO దేశాలు రష్యా ఆయిల్ కొనడం ఆశ్చర్యంగా ఉంది. అదే మిమ్మల్ని బలహీనం చేస్తోంది. దీనికి సరేనంటేనే నేను ముందుకెళ్తాను. బలమైన టారిఫ్స్తోనే చైనా, రష్యా బంధం బ్రేక్ అవుతుంది. అప్పుడే యుద్ధం ఆగుతుంది. లేదంటే US టైమ్, ఎనర్జీ, మనీ వృథా అవుతాయి’ అని స్పష్టం చేశారు. లేఖలో భారత ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
News September 13, 2025
కృష్ణా జలాల్లో 71% వాటా డిమాండ్ చేస్తున్నాం: ఉత్తమ్

TG: నదీ జలాల వాటా సాధనలో రాష్ట్ర ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 811 TMCల కృష్ణా జలాల్లో 71% డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. చుక్కనీటిని వదులుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కృష్ణా ట్రిబ్యునల్-2 సమావేశంలో బలంగా వాదిస్తామన్నారు. గత పాలకుల ఉదాసీనత వల్ల ఏపీ అక్రమంగా నీటిని తరలించుకొని ప్రయోజనం పొందిందని విమర్శించారు.
News September 13, 2025
ఒంటరిగా ఉండకండి.. ఇది ప్రమాదకరం!

ప్రస్తుతం ఒంటరితనం ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. సోషల్ మీడియాలో ఉంటూ సమాజానికి దూరం కావడం, ఆర్థిక పరిస్థితులు, పట్టణీకరణ వంటి కారణాలతో ఒంటరితనం పెరిగినట్లు WHO పేర్కొంది. ఇది కేవలం మానసిక సమస్య కాదు, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి ఆరోగ్య సమస్యలకూ దారితీస్తుంది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 8,71,000 మందికిపైగా చనిపోతున్నట్లు వెల్లడించింది. అంటే ఒంటరితనం వల్ల గంటకు 100 మంది చనిపోతున్నారన్నమాట.