News December 30, 2024

‘భారత్‌కు బ్యాడ్‌న్యూస్. ఎవ్వరూ రిటైరవ్వడం లేదు’

image

మెల్‌బోర్న్ టెస్టులో టీమ్ఇండియా ఘోర ఓటమిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీ, రోహిత్ వీడ్కోలు పలకాలంటూ Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే 55k పోస్టులు పెట్టారు. ‘సిగ్గుంటే రోహిత్, కోహ్లీ రిటైరవ్వాలి’, ‘టెస్టులకు అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం అవమానం కాదు. రోహిత్, కోహ్లీ ఇంకా ఆడుతుండగా ఇవ్వడమే అవమానం’, ‘భారత్‌కు బ్యాడ్‌న్యూస్. ఎవ్వరూ రిటైరవ్వడం లేదు’ అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

Similar News

News January 2, 2025

ఈడీ విచారణకు హాజరుకాని బీఎల్ఎన్ రెడ్డి

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో ఈడీ విచారణకు బీఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు మరి కొంత గడువు కావాలని ఈడీకి మెయిల్ చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు త్వరలోనే మరో తేదీని వెల్లడిస్తామన్నారు.

News January 2, 2025

థియేటర్లో ఉండగానే ఆన్‌లైన్‌లోకి మూవీ.. హీరో ఆవేదన

image

భాగమతి ఫేమ్ ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ మూవీ ‘మార్కో’ పైరసీ బారిన పడింది. థియేటర్లలో ఉండగానే మూవీ ఆన్‌లైన్‌లో దర్శనమిచ్చింది. దీనిపై ముకుందన్ అసహనం వ్యక్తం చేశారు. మూవీ పైరసీ కావడంతో నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి పైరసీ మూవీని చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ యాక్షన్ మూవీ కేరళలో మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగులో నిన్న విడుదలైంది.

News January 2, 2025

కలుసుకోవాలని..! సినిమా కాదు రాజకీయ ఎత్తుగడ

image

మహారాష్ట్రలో కుటుంబ కథా రాజకీయ డ్రామా కొనసాగుతోంది. చీలిన NCP మళ్లీ ఒక్కటయ్యేందుకు బీజం పడ్డట్టే కనిపిస్తోంది. 2 వర్గాల MP, MLAలు ఇదే రాగం ఆలపిస్తున్నారు. శరద్ పవార్ తనకు దేవుడని, తన ఛాతీని చీలిస్తే ఆయనే కనిపిస్తారని అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. మళ్లీ కుటుంబం, పార్టీ కలవాలని అజిత్ తల్లి ఆశాథాయి పండరీపురి విఠలుడిని వేడుకున్నారు. త్వరలోనే శరద్‌ను కలిసి విషయం ప్రతిపాదిస్తానని పేర్కొన్నారు.