News December 6, 2024
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బ్యాడ్ న్యూస్

AP: కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ సంక్రాంతికి పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దీనిపై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 2 నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందని వార్తలు వచ్చినా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు సివిల్ సప్లైస్ శాఖ మాత్రం తమ వైపు ఎలాంటి ఆటంకాలు లేవని చెబుతోంది. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అంటోంది.
Similar News
News January 22, 2026
NLG: పోలీసుల్లో క్రీడా స్ఫూర్తి నింపాలి: ఎస్పీ

పోలీసుల వృత్తిపరమైన ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. నల్లగొండలో ‘యాదాద్రి జోన్-5 పోలీస్ స్పోర్ట్స్ మీట్-2026’ను ఆయన ప్రారంభించారు. మూడు జిల్లాల నుంచి 320 మంది సిబ్బంది 40 విభాగాల్లో ప్రతిభ చాటారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన 140 మంది క్రీడాకారులు జోన్ కీర్తిని చాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వినోద్, రమేశ్ పాల్గొన్నారు
News January 22, 2026
ఆస్కార్-2026 నామినీల లిస్ట్ విడుదల

ఆస్కార్ రేసులో నిలిచిన నామినీ పేర్లను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారత్ నుంచి పోటీ పడిన ‘హోమ్ బౌండ్’కి చోటు దక్కలేదు. ఈ విభాగంలో ది సీక్రెట్ ఏజెంట్ (బ్రెజిల్), ఇట్ వాజ్ జస్ట్ యాన్ ఆక్సిడెంట్(ఫ్రాన్స్), సెంటిమెంటల్ వాల్యూ (నార్వే), సిరాట్(స్పెయిన్), ది వాయిస్ ఆఫ్ హింద్ రజాబ్ (ట్యునీషియా) చోటు దక్కించుకున్నాయి. విభాగాల వారీగా లిస్ట్ కోసం పైన ఫొటోలు స్లైడ్ చేయండి.
News January 22, 2026
కూటమిని విడగొడితేనే జగన్ అధికారంలోకి వస్తారు: విజయసాయి

AP: మాజీ MP విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం కష్టమని అన్నారు. కూటమిని విడగొడితేనే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ మద్యం స్కామ్ కేసులో ఈడీ విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని కేసుల్లో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.


