News September 1, 2024
పవన్ కళ్యాణ్ అభిమానులకు బ్యాడ్ న్యూస్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా OG మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్, పోస్టర్‌ను రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు ప్రకటించారు. త్వరలో మరింత పెద్దగా వేడుక జరుపుకుందామని పిలుపునిచ్చారు. నిర్మాతల నిర్ణయంతో పవర్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 2, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 2, 2025
3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్
2025-26లో 2వేల జనరల్ కోచ్‌ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
News February 2, 2025
రైల్వేకు కేటాయింపులు ఇలా(రూ.కోట్లలో)
✒ మొత్తం బడ్జెట్- 2,65,200
✒ ఉద్యోగుల పెన్షన్ ఫండ్- 66,000
✒ రైల్వే సేఫ్టీ ఫండ్- 45,000
✒ కొత్త లైన్ల నిర్మాణం- 32,235
✒ లైన్ల డబ్లింగ్- 32,000
✒ గేజ్ లైన్లుగా మార్పునకు- 4,500
✒ విద్యుత్ లైన్లు- 6,150
✒ సిబ్బంది సంక్షేమం- 833
✒ ఉద్యోగుల శిక్షణ- 301