News January 2, 2025
రోహిత్ శర్మ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్!

ఆస్ట్రేలియాతో రేపటి నుంచి జరిగే ఐదో టెస్టు నుంచి టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ మ్యాచులో కెప్టెన్‌గా బుమ్రా వ్యవహరిస్తారని క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ మ్యాచుకు తాను దూరంగా ఉంటానని హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అగార్కర్‌కు స్వయంగా రోహితే చెప్పినట్లు సమాచారం. దీనిపై రేపు స్పష్టత రానుంది. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
Similar News
News November 13, 2025
నవోదయ, KVSలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

దేశంలోని నవోదయ, కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు CBSE షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రేపటి నుంచి <
News November 13, 2025
రబీలో మొక్కజొన్న సాగు చేస్తున్నారా?

రబీలో మొక్కజొన్నను నవంబరు 15లోగా విత్తుకుంటే అధిక దిగుబడులు పొందవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. దీని కోసం ఎకరాకు 8 కిలోల విత్తనం అవసరం. ఒక కిలో విత్తనానికి 6ml నయాంట్రానిలిప్రోల్ + థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. దుక్కి చేసిన నేలలో 60 సెం.మీ. ఎడం ఉండునట్లు బోదెలు చేసుకోవాలి. విత్తనాన్ని మొక్కకు మొక్కకు మధ్య 20 సెం.మీ. దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తిన వెంటనే నీటి తడిని అందించాలి.
News November 13, 2025
రూ.30 కోట్లతో మినీ వేలంలోకి CSK?

IPL-2026 మినీ వేలానికి ముందు CSK రిటెన్షన్స్‌పై మరికొన్ని అప్డేట్స్ బయటికొచ్చాయి. రచిన్ రవీంద్ర, కాన్వేతో పాటు చాలా మంది స్వదేశీ ప్లేయర్లను రిలీజ్ చేయాలని ఆ టీమ్ నిర్ణయించుకున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఫారిన్ ప్లేయర్లు మతీశా పతిరణ, నాథన్ ఎల్లిస్‌ను రిటైన్ చేసుకోనున్నట్లు పేర్కొన్నాయి. దాదాపు రూ.30 కోట్ల పర్స్‌తో CSK వేలంలో పాల్గొననున్నట్లు సమాచారం.


