News October 25, 2024

బెడిసికొట్టిన ప్లాన్.. భారత్ ఆలౌట్

image

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ వేసిన ‘స్పిన్’ ప్లాన్ బెడిసికొడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు కివీస్ స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. శాంట్నర్(7), ఫిలిప్స్(2) ధాటికి కుదేలైన భారత్ 156 రన్స్ మాత్రమే చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 103 పరుగులు వెనుకబడి ఉంది. ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పిన్ పిచ్‌లో భారత్ తరఫున సుందర్(7), అశ్విన్(3) వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

Similar News

News October 25, 2024

సంచలనం: 52కు 2 వికెట్లు.. 53కు ఆలౌట్

image

ఆస్ట్రేలియా వన్డే కప్‌లో సంచలనం నమోదైంది. టాస్మానియాపై వెస్ట్రన్ ఆస్ట్రేలియా 1 రన్ తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 52/2 ఉన్న వెస్ట్రన్ ఆస్ట్రేలియా 53కే ఆలౌటైంది. టాస్మానియా బౌలర్ బ్యూ వెబ్‌స్టర్ (5 వికెట్లు) ధాటికి ఆ జట్టు ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ జట్టులో బాన్‌క్రాఫ్ట్, ఇంగ్లిస్, టర్నర్, కనోల్లీ, కార్ట్‌రైట్, అగర్, రిచర్డ్‌సన్, మోరిస్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లుండటం విశేషం.

News October 25, 2024

హమాస్, ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్?

image

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కైరోలో చర్చలు జరుగుతున్నాయని, ఇందులో మొస్సాద్ చీఫ్ డేవిడ్ బోర్నియా కూడా పాల్గొన్నట్లు సమాచారం. ఈ చర్చలకు యూఎస్, ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇరుదేశాలు కాల్పులను విరమిస్తాయని సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసేందుకే ఇరాన్ మొగ్గుచూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

News October 25, 2024

అనుభవం నుంచి వచ్చిన ఆలోచనతో..!

image

దీపావళికి సొంతూరుకు వెళ్లేందుకు బస్సు టికెట్ లభించకపోవడంతో ఇబ్బంది పడిన ఓ యువకుడికి వచ్చిన ఆలోచన రూ.వేల కోట్లకు అధిపతిని చేసింది. నిజామాబాద్‌కు చెందిన ఫణీంద్ర సామ అనే వ్యక్తి బస్ స్టాండ్‌కి వెళ్లగా సీటు లభించకపోవడంతో ఆగిపోయాడు. దీంతో ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకునే సదుపాయం ఉంటే ఎందరికో ఉపయోగపడుతుందని భావించి RedBusను స్టార్ట్ చేశారు. తొలుత ఇబ్బందులు ఏర్పడినా ఎదుర్కొని ముందుకెళ్లి విజయం సాధించారు.