News September 23, 2024

పోలీసుల కాల్పుల్లో బదలాపూర్ నిందితుడి మృతి

image

మహారాష్ట్రలోని బదలాపూర్‌లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక దాడి కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల కాల్పుల్లో మరణించాడు. పోలీసులు వాహనం ఎక్కిస్తుండగా వారి నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపాడు. పోలీసులు తిరిగి ఎదురుకాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడని థానే పోలీసులు వెల్లడించారు.

Similar News

News September 23, 2024

అనర్హుల పెన్షన్లు తొలగించాలి: సీఎం చంద్రబాబు

image

AP: వైద్యుల నుంచి తప్పుడు సర్టిఫికెట్లతో కొంత మంది దివ్యాంగుల పేరుతో పెన్షన్లు తీసుకోవడాన్ని అరికట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రత్యేకంగా గ్రామ సభలు పెట్టి అర్హులకు పెన్షన్లు ఇవ్వడంతో పాటు, అనర్హులను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అనర్హులు స్వచ్ఛందంగా తమ పెన్షన్లను వదులుకోవాలని సీఎం సున్నితంగా హెచ్చరించారు.

News September 23, 2024

కేతిరెడ్డిపై మంత్రి సత్య కుమార్ విమర్శలు

image

AP: ధర్మవరం సబ్ జైలు వద్ద మాజీ MLA కేతిరెడ్డి <<14175931>>వాహనంపై<<>> టీడీపీ కార్యకర్త ఎక్కగా దూసుకెళ్లిన ఘటనపై మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శలకు దిగారు. ఓటమితో మైండ్ బ్లాక్ అయ్యి ప్రజల పైకి తన వాహనాన్ని నడిపి, గుద్దుకుంటూ వెళ్లిపోయారని దుయ్యబట్టారు. గతంలో చేసిన తప్పులు, కబ్జాలు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే త్వరలోనే తీరుస్తామని ట్వీట్ చేశారు.

News September 23, 2024

మహీంద్రా థార్ రాక్స్ తొలి కారు వేలం.. ఎంత పలికిందంటే..

image

మహీంద్రా సంస్థ తమ థార్ కారుకు అప్‌డేట్‌గా థార్ రాక్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో తయారుచేసిన తొట్టతొలి కారును ఛారిటీ కోసం తాజాగా వేలం వేయగా ఏకంగా రూ.1.31 కోట్లకు అమ్ముడుపోయింది. VIN 0001 ఛాసిస్ నంబర్ కలిగిన ఈ కారు AX7 L డీజిల్ 4×4 టాప్ వేరియెంట్. ఆనంద్ మహీంద్రా సంతకం ఈ కారుకు మరో ప్రత్యేకత. రాక్స్ బేస్ వేరియెంట్ ఆన్‌రోడ్ ధర రూ.16 లక్షలుగా ఉంది.