News August 1, 2024
BADMINTON: ఎనిమిదిసార్లు ఓడించిన జట్టు చేతిలోనే మళ్లీ..!

ఫైనల్ చేరి గోల్డ్ కొడుతుందనుకున్న సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్టర్స్‌లో ఓడటంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. విజేతగా నిలిచిన మలేషియా జోడీ (చియా ఆరోన్- సోహ్ వోయ్ యిక్) గతంలో వీరిని వరుసగా ఎనిమిది సార్లు ఓడించింది. 2023లో సాత్విక్-చిరాగ్ జోడీ వరుసగా మూడుసార్లు గెలిచి ప్రతీకారం తీర్చుకోవడంతో ఒలింపిక్స్‌లో వీరి మధ్య పోరుపై అంచనాలు పెరిగాయి. కానీ దురదృష్టవశాత్తు మలేషియా మళ్లీ పైచేయి సాధించింది. <<-se>>#Olympics2024<<>>
Similar News
News March 3, 2026
RITES లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News March 3, 2026
అమెరికా భూభాగంపై ఇరాన్ ఎందుకు దాడి చేయట్లేదు?

టెహ్రాన్ నుంచి USA తూర్పు తీరం దాదాపు 10వేల KM దూరంలో ఉంది. ఇరాన్ బాలిస్టిక్ మిస్సైళ్లు 2,000-2,500 KM మాత్రమే వెళ్తాయి. అందుకే ఇరాన్ అమెరికా భూభాగంపై కాకుండా ఇజ్రాయెల్, గల్ఫ్‌లోని అమెరికా మిలిటరీ బేస్‌లపై దాడి చేస్తోంది. కానీ అమెరికా దగ్గర ఖండాంతర క్షిపణులు (ICBM) ఉన్నాయి. ఇవి 13వేల KM ప్రయాణించగలవు. గంటకు 28వేల KM వేగంతో దూసుకెళ్తాయి. అలాగే B-2, B-52 బాంబర్లు US అమ్ములపొదిలో ఉన్నాయి.
News March 3, 2026
నిన్న రక్షణ మంత్రిగా బాధ్యతలు.. ఇవాళ..

ఇరాన్ ప్రభుత్వంలోని కీలక నేతలను ఇజ్రాయెల్ వరుసగా చంపుతోంది. IDF దాడుల్లో ఇరాన్ కొత్త రక్షణ మంత్రి మజీద్ ఇబిన్ అల్ రెజా మరణించినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. మంత్రిగా రెజా నిన్ననే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ <<19266671>>అటాక్‌లో<<>> రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదే చనిపోయారు. ఆయన స్థానంలో నియమితులైన రెజా కూడా మృతి చెందారు.


