News August 4, 2024

BADMINTON: ఇక మిగిలింది కాంస్యమే

image

బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి భారత అభిమానులను నిరాశపర్చింది. అయితే సేన్ ఒలింపిక్ మెడల్ సాధించేందుకు మరో అవకాశం ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో మలేషియా ఆటగాడు లీ జీపై గెలిస్తే కాంస్య పతకం లక్ష్యసేన్‌ను వరిస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా సెమీస్‌లో లక్ష్యసేన్‌పై గెలిచిన విక్టర్ అక్సెల్‌సెన్, విటిడ్‌సార్న్‌తో (థాయ్‌లాండ్‌) ఫైనల్‌లో తలపడనున్నారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News January 20, 2025

‘అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది’

image

AP: విజయనగరం(D) నెల్లిమర్ల మిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థి సాయి మణిదీప్(24) ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు ఫ్యామిలీకి అతడు రాసిన లేఖ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘డాడీ, అమ్మ, తమ్ముడు నన్ను క్షమించండి. కష్టపడి చదువుదామంటే నాతో కావడంలేదు. బతకాలంటే భయమేస్తోంది. 8-9 నెలల నుంచి సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయి. పదేళ్లుగా మిమ్మల్ని చాలా కష్టపెట్టా. నాలాంటి పిచ్చోడు బతకకూడదు’ అని రాసిన లేఖ వైరలవుతోంది.

News January 20, 2025

బంగాళదుంపలు రోజూ తింటున్నారా?

image

బంగాళదుంపలను ఆహారంలో రోజు కాకుండా వారానికి రెండు, మూడు రోజులు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటికి వేడి స్వభావం ఉండటం వల్ల వాంతులు, విరేచనాలతో పాటు జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశముందని అంటున్నారు. రక్తపోటు, మధుమేహ సమస్యలు ఉన్న వారు తినడం తగ్గించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వీటిని నూనెలో వేయించి తినడం కంటే ఉడకబెట్టుకొని తినడం మేలు అని చెబుతున్నారు.

News January 20, 2025

కొత్త ఫోన్‌తో ఎర.. రూ.2.8 కోట్లు టోకరా

image

బెంగళూరులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. లాటరీలో మొబైల్ గెలుచుకున్నారంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్‌కి కొరియర్‌లో ఫోన్ పంపారు. నిజమేనని నమ్మిన అతను కొత్త ఫోన్‌లో సిమ్ వేశాడు. ఇదే అదనుగా నేరగాళ్లు మొబైల్‌ను తమ అధీనంలోకి తీసుకొని ఖాతా నుంచి రూ.2.8 కోట్ల నగదు కాజేశారు. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోలీసులను ఆశ్రయించాడు.