News April 10, 2025

బ్యాడ్మింటన్ ఆసియా: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సింధు

image

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇండోనేషియాకు చెందిన ఎస్తేర్ వార్డోయోపై ఆమె వరస సెట్లలో 21-15, 21-19 తేడాతో గెలుపొందారు. తర్వాతి రౌండ్‌లో జపాన్‌కు చెందిన అకానీ యమగుచీతో ఆమె తలపడనున్నారు. మరోవైపు లక్ష్యసేన్, ప్రణోయ్ ఇద్దరూ ఇంటిబాట పట్టారు.

Similar News

News November 23, 2025

TODAY HEADLINES

image

* సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము
* డ్రగ్స్-టెర్రర్ లింక్‌‌ను నాశనం చేయాలి: మోదీ
* సత్యసాయి బాబా సిద్ధాంతాలే నిజమైన విద్య: ఉప రాష్ట్రపతి
* అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ సాకారం కాలేదు: రేవంత్
* కొత్త లేబర్ కోడ్‌లు.. గొప్ప సంస్కరణల్లో ఒకటి: CBN
* TG పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్స్ జీవో విడుదల
* బెంగళూరులో ప్రైవేట్ ఈవెంట్‌లో ఒకే వేదికపై జగన్, కేటీఆర్

News November 23, 2025

ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదు: శ్రీధర్ బాబు

image

TG: ఆరోపణలు చేయడం, అబద్ధాలు చెప్పడం కేటీఆర్, <<18359759>>హరీశ్<<>> రావుకు అలవాటేనని మంత్రి శ్రీధర్ బాబు దుయ్యబట్టారు. భూముల ధరలపై చేస్తున్న వ్యాఖ్యలు దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఫ్రీ హోల్డ్ జీవోల వెనుక ఉన్న రూ.లక్షల కోట్ల మతలబు ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ భూమిని అమ్మకానికి పెట్టలేదని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు.

News November 23, 2025

11 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

image

AP: 11 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు కళ్యాణం శివశ్రీనివాసరావు, స్టేట్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఛైల్డ్ లేబర్‌కు సత్యనారాయణ రాజు, ఉర్దూ అకాడమీకి మౌలానా షిబిలీ, అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్‌కు విక్రమ్, ఫిషర్‌మెన్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్‌కు రామ్‌ప్రసాద్, స్టేట్ షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సొసైటీకి ముక్తియార్‌ను నియమించింది.