News April 6, 2025

మైనర్‌పై రేప్ కేసులో బ్యాడ్మింటన్ కోచ్ అరెస్ట్

image

బెంగళూరులో బాలికపై రేప్ కేసులో బ్యాడ్మింటన్ కోచ్ సురేశ్ బాలాజీ అరెస్టయ్యాడు. TNకు చెందిన సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. ఓ బాలిక(16) రెండేళ్ల క్రితం అందులో చేరగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారం చేశాడని పోలీసులు వెల్లడించారు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని చెప్పారు. అతడి ఫోన్‌లో మరో 8మంది న్యూడ్ ఫొటోలు ఉన్నాయన్నారు. మిగతా ట్రైనీలపైనా అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

Similar News

News November 28, 2025

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.710 పెరిగి రూ.1,28,460కు చేరింది. అలాగే 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 ఎగబాకి రూ.1,17,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,83,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 28, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

హైదరాబాద్‌-నాచారంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>) గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు డిసెంబర్ 9న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 25ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇప్పటికే అప్రెంటిస్‌గా శిక్షణ పొందినవారు అనర్హులు. వెబ్‌సైట్: https://bel-india.in/

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది