News October 20, 2024

బద్వేల్ ఘటన.. కీలక విషయాలు వెలుగులోకి

image

AP: <<14403526>>బద్వేల్ ఘటనలో<<>> కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో యువతిని అడ్డు తొలగించేందుకు నిందితుడు విఘ్నేశ్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు విచారణలో ప్రాథమికంగా తేల్చారు. ఆ యువతి అతనికి చిన్నతనం నుంచే పరిచయం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల విఘ్నేశ్‌‌కు వేరొకరితో వివాహమైంది. ఈ క్రమంలో పథకం ప్రకారమే యువతిని బైక్‌పై తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 20, 2024

దగ్గు, జలుబు మందులతో సంతానోత్పత్తి?

image

ఈమధ్య కొందరు గర్భధారణకు దగ్గు, జలుబు మందులు వాడుతుండటంతో ‘ముసినెక్స్ మెథడ్’ SMలో ట్రెండవుతోంది. 40జంటలపై సైంటిస్టులు అధ్యయనం చేస్తే వారిలో 15మంది గర్భం దాల్చారు. ఈ మెథడ్‌తో ఓ పురుషుడిలోనూ స్పెర్మ్ క్వాంటిటీ పెరిగినట్లు తేలిందని ఫెర్టిలిటీ అండ్ స్టెరిలిటీ జర్నల్‌ ప్రచురించింది. కాగా ఈ మెథడ్ సంతానోత్పత్తికి సహాయపడగలదని రుజువు చేసే శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువని సైంటిస్టులు చెబుతున్నారు.

News October 20, 2024

దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు: మంత్రి నాదెండ్ల

image

AP: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ స్కీమ్ కింద అర్హులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా అందిస్తామని పేర్కొన్నారు. పథకం అమలుకు ఏడాదికి రూ.3,000కోట్ల ఖర్చు అవుతుందని, తదుపరి క్యాబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు.

News October 20, 2024

ఆ ఏడాది OCT 5-14 తేదీలేమయ్యాయి?

image

తేదీలు మాయమవడం ఏంటని అనుకుంటున్నారా? గూగుల్‌లో 1582 నాటి క్యాలెండర్‌ను ఓ సారి చెక్ చేయండి. అక్టోబర్ నెలలో 5 నుంచి 14 వరకు తేదీలు కనపించవు. అప్పటివరకు సోలార్ క్యాలెండర్‌ను బేస్ చేసుకొని రూపొందించిన జూలియన్ క్యాలెండరే చాలా దేశాలు అనుసరించేవి. 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ అందుబాటులోకి రావడంతో 10 రోజులు ముందుకు వెళ్లాల్సి వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ అదే క్యాలెండర్‌ను అనుసరిస్తున్నాం.