News August 18, 2025
బహుజన బందూక్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్

మొగల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నేడు. జనగామ జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ తన పోరాట పటిమతో నిజాం రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి, అప్పటి దోపిడీ వ్యవస్థను ఎదిరించారు. ఆయన పోరాటానికి నిదర్శనంగా HYDలోని ట్యాంక్‌బండ్‌పై విగ్రహం ఏర్పాటు చేసేందుకు CM రేవంత్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.
Similar News
News August 18, 2025
ప్రేయసితో రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

‘ఆస్కార్’తో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తన ప్రేయసి హరిణి రెడ్డితో త్వరలోనే ఆయన ఏడడుగులు వేయనున్నారు. నిన్న హైదరాబాద్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను పలువురు సోషల్ మీడియాలో షేర్ చేశారు. హరిణి నేపథ్యం గురించి తెలియాల్సి ఉంది.
News August 18, 2025
ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం?

ఉపరాష్ట్రపతి ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు NDA కసరత్తులు చేస్తోంది. ఇదే విషయమై AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇతర పార్టీ నేతలతో BJP నేతలు మాట్లాడుతున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికల బరిలో నిలవాలని INDI కూటమి ఆలోచనలో ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణను ప్రకటించిన సంగతి తెలిసిందే.
News August 18, 2025
కేంద్ర మంత్రి జైశంకర్‌తో లోకేశ్ భేటీ

AP: ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి జైశంకర్‌తో మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. వలస కార్మికులకు ఓవర్సీస్ ట్రైనింగ్, మైగ్రేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం అనుమతులతో పాటు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఏపీ యువతకు మెరుగైన విదేశీ ఉద్యోగావకాశాల కల్పనకు కేంద్రం నుంచి ఏపీకి డేటా షేరింగ్ సహకారాన్ని అందించాలని రిక్వెస్ట్ చేశారు. కేంద్ర మంత్రులు పియూశ్ గోయల్, అశ్విని వైష్ణవ్‌తోనూ లోకేశ్ సమావేశం కానున్నారు.