News July 16, 2024

బీసీసీఐతో సెటిల్‌మెంట్ కోసం బైజూస్ ప్రయత్నం?

image

BCCI పిటిషన్‌తో NCLT బైజూస్‌పై <<13640730>>చర్యలు<<>> చేపట్టడంతో ఈ వ్యవహారాన్ని కోర్టు వెలుపల సెటిల్ చేసుకోవాలని ఆ సంస్థ భావిస్తోందట. BCCIని వెనక్కితగ్గేలా ఒప్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి ముందు ప్రస్తుతం అమలులో ఉన్న ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్‌పై నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ నుంచి బైజూస్ స్టే తెచ్చుకోవాలని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Similar News

News December 18, 2025

311 పోస్టులకు నోటిఫికేషన్

image

రైల్వేలో 311 ఉద్యోగాల భర్తీకి RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సీనియర్ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్, ల్యాబ్ అసిస్టెంట్, జూ.ట్రాన్స్‌లేటర్, స్టాఫ్&వెల్ఫేర్ ఇన్‌స్పెక్టర్ తదితర ఖాళీలున్నాయి. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, PG(హిందీ&ఇంగ్లిష్), డిగ్రీ పాసై, వయసు 18-40 ఏళ్లు ఉండాలి. DEC 30 నుంచి JAN 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. త్వరలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది.
వెబ్‌సైట్: rrbcdg.gov.in/

News December 18, 2025

తిరుమలలో రెండు బ్రహ్మోత్సవాలు ఎందుకు?

image

సాధారణంగా తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఏడాదికి ఒకసారే జరుగుతాయి. అయితే ప్రతి మూడేళ్లకోసారి చాంద్రమానం ప్రకారం అధికమాసం వచ్చినప్పుడు 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. భాద్రపద మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలను అదనంగా నిర్వహిస్తారు. ఆ వెంటనే దసరా నవరాత్రుల్లో, ఆశ్వయుజ మాసంలో రెండోసారి ఉత్సవాలు చేస్తారు. అయితే, రెండో ఉత్సవంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం వేడుకలు ఉండవు. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News December 18, 2025

ట్రంప్ గోల్డ్ కార్డు వీసా ఫెయిల్.. కారణాలు ఇవే

image

US అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన $1M <<18527355>>గోల్డ్ కార్డ్ వీసా<<>>కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. నిబంధనల్లో క్లారిటీ లేకపోవడం, పర్మనెంట్ రెసిడెన్సీ/దేశ పౌరసత్వం గురించి స్పష్టంగా చెప్పకపోవడమే దీనికి ప్రధాన కారణాలు. దీనికంటే EB-5 ఇన్వెస్టర్ వీసా బెటర్‌ ఆప్షన్‌గా చూస్తున్నారు. దీని ప్రకారం ఒక కుటుంబం $800,000 నుంచి $1.05M పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఇదే గోల్డ్ కార్డుకి అయితే ఒక వ్యక్తి $1M కట్టాలి.