News April 27, 2024

AAP ఎమ్మెల్యేకు బెయిల్

image

ఈడీ విచారణను ఎదుర్కొంటున్న ఆమ్ఆద్మీ MLA అమానతుల్లా ఖాన్‌కు బెయిల్ మంజూరైంది. రూ.15వేల పర్సనల్ బాండ్ చెల్లించి బెయిల్ పొందేందుకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో నియామకాలు, బోర్డు ప్రాపర్టీల లీజు మంజూరుపై ఈడీ ఆయనను విచారిస్తోంది. ఈనెల 18న ఈడీ ఖాన్‌ను అరెస్ట్ చేసింది. కాగా ఈనెల తొలివారంలో లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన AAP ఎంపీ సంజయ్ సింగ్‌కు బెయిల్ మంజూరు అయింది.

Similar News

News January 31, 2026

WPL: ముంబైపై గుజరాత్ విజయం

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్‌తో మ్యాచులో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత గుజరాత్ 20 ఓవర్లలో 167/4 స్కోర్ చేయగా, అనంతరం ముంబై 20 ఓవర్లలో 156/7కి పరిమితమైంది. MI కెప్టెన్ హర్మన్ ప్రీత్ (48 బంతుల్లో 82*) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ టోర్నీ చరిత్రలో ముంబైపై గుజరాత్‌కి ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ విజయంతో ఆ జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది.

News January 31, 2026

మేడారంలో మొబైల్ ఛార్జింగ్‌కు రూ.50!

image

మేడారం జాతర ‘కాదేదీ వ్యాపారానికి అనర్హం’ అన్నట్లుగా మారింది. మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తుల అవసరమే కొందరికి ఉపాధినిస్తోంది. అక్కడ ఏర్పాటు చేసిన ఛార్జింగ్ పాయింట్లలో ఒక్క మొబైల్ ఫుల్ ఛార్జ్ అయ్యేందుకు రూ.50 వసూలు చేస్తున్నారు. అలాగే వేడి నీళ్లంటూ కొందరు, స్నానాలు చేసే సమయంలో బ్యాగులకు కాపలా ఉంటూ మరికొందరు కూడా జాతరలో ఉపాధి పొందుతున్నారు.

News January 30, 2026

కాలుష్యాన్ని నివారించలేం.. నియంత్రించాలి: పవన్

image

AP: కాలుష్యం మన జీవితంలో అంతర్భాగమైందని DyCM పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొంతమేర పొల్యూషన్‌ను భరించకతప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. పూర్తిస్థాయిలో నివారించలేకున్నా నియంత్రించే ప్రయత్నం చేయాలని సూచించారు. పారిశ్రామికవాడల్లో ప్రత్యేక శ్రద్ధపెట్టాలని చెప్పారు. విశాఖ పరిధిలోని పరిశ్రమల యాజమాన్యాలతో ఆయన భేటీ అయ్యారు. పరిశ్రమలు 33% గ్రీన్ బెల్ట్ రూల్ పాటించాలని స్పష్టంచేశారు.