News May 3, 2024
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు నిందితులకు బెయిల్

TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ, శుక్రవారాల్లో దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటివరకు అస్మా తస్లీమ్, పెండ్యాల వంశీకృష్ణ, మన్నె సతీశ్, నవీన్, గీత అనే ఐదుగురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా జడ్జి బెయిల్ మంజూరు చేశారు.
Similar News
News October 29, 2025
టాస్ ఓడిన టీమ్ ఇండియా

ఇండియాతో జరుగుతున్న 5 టీ20ల సిరీస్లోని తొలి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది.
IND ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, గిల్, సూర్యకుమార్(C), తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా
AUS ప్లేయింగ్ XI: మార్ష్(కెప్టెన్), హెడ్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, ఓవెన్, స్టోయినిస్, ఫిలిప్, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, కుహ్నెమాన్, హేజిల్వుడ్
News October 29, 2025
అర్హుల ఓట్లు తొలగిస్తే కాళ్లు విరగ్గొడతాం: బెంగాల్ మంత్రి

SIR పేరిట CAA అమలుకు BJP, EC ప్రయత్నిస్తున్నాయని బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ ఆరోపించారు. అర్హులైన ఒక్కరి ఓటు తొలగినా ఊరుకొనేది లేదని, కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించారు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని, మమత సీఎంగా ఉన్నన్నాళ్లూ రాష్ట్రంలో NRC అమలు కాబోదని స్పష్టం చేశారు. కాగా SIR పారదర్శకంగా జరుగుతుందని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగబోదని బెంగాల్ CEO స్పష్టం చేశారు.
News October 29, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(IIIM)జమ్మూ 4 జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 13వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, మాస్టర్ డిగ్రీ( హిందీ / ఇంగ్లిష్) ఉత్తీర్ణులు అర్హులు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iiim.res.in.


