News March 23, 2024
బిగ్‌బాస్ విన్నర్‌కు బెయిల్

పాము విషం సరఫరా కేసులో అరెస్టైన బిగ్‌బాస్ ఓటీటీ2 విన్నర్, యూట్యూబర్ ఎల్విశ్ యాదవ్‌కు బెయిల్ మంజూరైంది. నోయిడా జైలులో ఉన్న ఆయనకు గురుగ్రామ్ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. మార్చి 17న ఎల్విశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News October 22, 2025
కార్తీక మాసంలో ఇలా చేస్తే ఎంతో పుణ్యం

కార్తీక మాసం నదీ స్నానాలు, దీపారాధనతోనే కాక నియమ నిష్ఠలతో కూడిన వ్రతాల ద్వారా కూడా ఎంతో పుణ్యాన్నిస్తుంది. ఈ నెల రోజుల్లో శివకేశవులను పూజించడం శ్రేయస్కరం. దేవాలయాలు, ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల మోక్షం లభిస్తుంది. శక్తి ఉన్నవారు ఉపవాసం ఆచరించాలి. సోమవారాలతో పాటు పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో రుద్రాభిషేకాలు, తులసి పూజ, కార్తీక పురాణ పారాయణం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం.
News October 22, 2025
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలు

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News October 22, 2025
అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్

నిన్న ఓ వెబ్‌సైట్‌పై <<18065234>>ఫైరయిన<<>> ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.


