News August 23, 2024
జోగి రాజీవ్‌కు బెయిల్

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు కేసులో ఇటీవల ఏసీబీ అధికారులు ఆయనను <<13840826>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.
Similar News
News March 5, 2026
మంచిర్యాల: అక్కాచెల్లెళ్లకు ఆర్మీ ఉద్యోగాలు

జన్నారం మండలంలోని గాంధీ నగర్‌కు చెందిన బొమ్మిడి శ్రావ్య, ప్రవళిక అనే అక్కా చెల్లెళ్లు ఇండియన్ మిలిటరీలో ఉద్యోగాలు సాధించారు. గాంధీనగర్‌కు చెందిన బొమ్మిడి రాజేందర్ కుమార్తెలైన శ్రావ్య, ప్రవళిక మిలటరీ పరీక్షను రాసి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. బుధవారం వారిని జన్నారం మండల కేంద్రంలోని పలువురు ప్రముఖులు సన్మానించారు.
News March 5, 2026
భావిభారత పౌరులు.. ఊబకాయులు!

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.
News March 5, 2026
సెమీస్‌లో టీమ్‌గా రాణిస్తారా?

T20WC: ఈరోజు ఇంగ్లండ్‌తో సెమీస్‌లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.


