News August 29, 2024

టెలిగ్రామ్ చీఫ్‌కు బెయిల్

image

మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో నేర కార్యకలాపాలను ప్రోత్సహించారనే ఆరోపణలపై అరెస్టైన ఆ సంస్థ చీఫ్ పావెల్ దురోవ్‌ కేసులో ఫ్రాన్స్ కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దేశం విడిచి వెళ్లకుండా అతనిపై నిషేధం విధించింది. ఐదు మిలియన్ యూరోల పూచీకత్తుపై కండిషనల్ బెయిల్ జారీ చేసింది. వారానికి రెండు సార్లు పోలీస్ స్టేషన్‌లో రిపోర్టు చేయాలని ఆదేశించింది.

Similar News

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. వివిధ రకాల నూనెల రేట్లు గత వారంతో పోలిస్తే కేజీపై ₹1-4 వరకు పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్‌నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం.

News March 13, 2026

సెలవు తేదీ మార్పు

image

AP: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ‘షబే ఖద్ర్’ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ సెలవును ఈ నెల 15 నుంచి 17వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు CS సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా బేసి సంఖ్య రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రాత్రిగా దీన్ని భావిస్తారు.

News March 13, 2026

కొబ్బరి మొక్కల ఎంపిక – రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.