News April 16, 2024

తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరు

image

AP: శిరోముండనం కేసులో జైలు శిక్ష పడిన వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు బెయిల్ మంజూరైంది. విశాఖ జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. కాగా దళితులను హింసించిన కేసులో త్రిమూర్తులు సహా 10 మంది నిందితులకు 18 నెలల జైలు శిక్షతో పాటు ₹2.50 లక్షల ఫైన్ విధించింది. ఈ కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. ప్రస్తుతం త్రిమూర్తులు మండపేట YCP అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

Similar News

News April 7, 2026

ఇది ఏపీ ప్రజల విజయం: సీఎం చంద్రబాబు

image

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం గెజిట్ <<19585476>>నోటిఫికేషన్<<>> విడుదల చేయడంపై CM చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలు, అమరావతి రైతుల విజయం అని పేర్కొన్నారు. ‘రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని మోదీకి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వానికి, ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన ఎంపీలందరికీ, రాష్ట్ర నాయకులకు, ప్రజలకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

News April 7, 2026

వర్షం.. KKRvsPBKS మ్యాచ్ రద్దు

image

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన KKRvsPBKS మ్యాచ్ రద్దయ్యింది. వర్షం ఎంత సేపటికీ తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. ఇవాళ KKR టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. మ్యాచ్ ఆగే సమయానికి 3.4 ఓవర్లలో 25/2 స్కోర్ చేసింది. ఇక 2025 ఏప్రిల్ 26న కూడా ఇదే వేదికలో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయ్యింది.

News April 7, 2026

రేపు ఇరాన్ మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చు: ట్రంప్

image

పశ్చిమాసియా యుద్ధం ముగింపు దశకు చేరుకుంటుందని ఆశించే లోపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ తెరవడంతో పాటు ఇరాన్ తమ దారిలోకి రాకపోతే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విజయవంతంగా నడుస్తోందన్నారు. ఒక్క రాత్రిలో ఇరాన్‌ను ధ్వంసం చేయగలమని, రేపే ఆ దేశం మొత్తం తుడిచిపెట్టుకుపోవచ్చని తెలిపారు. ఏ దేశానికీ లేని విధంగా అమెరికా వద్ద ఆయుధాలు ఉన్నాయని చెప్పారు.