News July 24, 2024
అరుదైన కేసుల్లోనే బెయిల్ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు

నిందితుడి బెయిల్‌ను రద్దు చేసే విషయంలో నిదానంగా వ్యవహరించాలని హైకోర్టులు, సెషన్ కోర్టులకు సుప్రీంకోర్టు సూచించింది. నిందితుడికి ఇచ్చిన స్వేచ్ఛలో కోర్టులు జోక్యం చేసుకోలేవని పేర్కొన్న సుప్రీంకోర్టు అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే బెయిల్‌ను రద్దు చేయాలని పేర్కొంది. నగదు అక్రమ రవాణా కేసులోని నిందితుడి బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడంపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News November 1, 2025
సానుభూతితో ఓట్లు దండుకోవాలనేది BRS యత్నం: రేవంత్

TG: జూబ్లీహిల్స్‌లో సానుభూతితో ఓట్లు దండుకోవాలని BRS ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. ‘2007లో PJR చనిపోతే ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని నిలబెట్టే సంప్రదాయానికి KCR తెరదీశారు. పదేళ్ల పాటు మైనార్టీ సమస్యలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70వేల ఉద్యోగాలిచ్చాం. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన KTR.. సునీతను బాగా చూసుకుంటారా?’ అని విమర్శించారు.
News November 1, 2025
రేపటిలోగా నిర్ణయం తీసుకోవాలి: ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థలు

TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదలపై రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ప్రైవేట్ ఉన్నత విద్యా సంస్థల ఛైర్మన్ రమేశ్ బాబు డిమాండ్ చేశారు. లేకపోతే ఎల్లుండి నుంచి రాష్ట్రంలోని అన్ని కాలేజీలు నిరవధిక బంద్ చేస్తాయని హెచ్చరించారు. బంద్ సమయంలో జరిగే ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యాజమాన్యాలను కోరుతున్నామన్నారు. కాలేజీలకు డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఉందా? లేదా? అని ఆయన ప్రశ్నించారు.
News November 1, 2025
అక్షతలు తలపైన వేసుకుంటే…

శాస్త్రం ప్రకారం.. అక్షతలు శుభాన్ని సూచిస్తాయి. అందుకే శుభ కార్యాల్లో, పండుగలప్పుడు వీటిని ఉపయోగిస్తారు. అక్షతలను ఇంట్లో ఎప్పుడూ ఉంచుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇవి ఇంట్లో ఉంటే అష్టైశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని నమ్మకం. పూజలో వాడిన అక్షతలను దాచుకుని, ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు వాటిని తలపైన వేసుకోవాలట. ఇలా చేస్తే చేయాలనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని నమ్మకం.


