News July 29, 2024
బెయిల్ విచారణలో ఇంగిత జ్ఞానం ఉండాలి: CJI

బెయిల్ పిటిషన్లను విచారించే సమయంలో న్యాయమూర్తులకు కామన్ సెన్స్ ఉండాలని CJI డీవై చంద్రచూడ్ సూచించారు. కొంతమంది జడ్జిలు కీలకమైన కేసుల్లో బెయిల్ ఇవ్వకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ‘ప్రతి కేసునూ క్షుణ్ణంగా పరిశీలించేందుకు బలమైన ఇంగిత జ్ఞానం ఉండాలి. ట్రయల్ కోర్టుల్లో బెయిల్ దొరక్క చాలామంది హైకోర్టులకు వస్తున్నారు. ఇది హైకోర్టులపై భారాన్ని మరింత పెంచుతోంది’ అని వివరించారు.
Similar News
News October 19, 2025
APPLY NOW: CWCలో ఉద్యోగాలు

సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC) 22 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థులు నవంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://cwceportal.com/
News October 19, 2025
మామిడిలో ఇనుపధాతు లోపం – నివారణ

మామిడిలో ఇనుపధాతులోప సమస్య ఉన్న చెట్ల ఆకులు పచ్చదనం కోల్పోయి తెల్లగా పాలిపోతాయి. ఆకుల సైజు తగ్గిపోతుంది. సమస్య తీవ్రత పెరిగితే మొక్కల ఆకులు పైనుంచి కిందకు ఎండిపోతాయి. ఇనుపధాతు లోపం సున్నపురాయి ఉన్న నేలల్లో సాధారణంగా కనిపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి 2.5 గ్రా అన్నబేధి+1 గ్రా. నిమ్మఉప్పు లేదా ఒక బద్ద నిమ్మకాయ రసం కలిపి 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు చెట్టుపై పిచికారీ చేయాలి.
News October 19, 2025
తొలి మహిళా సీఎం సుచేతా కృపలాని

స్వాతంత్ర్య సమరయోధురాలు సుచేతా కృపలాని దేశంలోనే తొలి మహిళా CMగా బాధ్యతలు చేపట్టి చరిత్రలో నిలిచారు. 1908లో పంజాబ్‌లోని జన్మించిన ఆమె బెనారస్ యూనివర్సిటీలో అధ్యాపకురాలిగా పనిచేశారు. 1936లో ప్రొఫెసర్ కృపలానీని మ్యారేజ్ చేసుకున్నారు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకెళ్లారు. స్వాతంత్య్రం తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి లోక్‌సభ, శాసనసభలకు ప్రాతినిధ్యం వహించారు. 1963లో UP CMగా ఎన్నికై చరిత్ర సృష్టించారు.