News October 23, 2024

చోటా రాజన్‌కు బెయిల్.. కానీ జైలులోనే!

image

అండర్ వరల్డ్ గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్‌కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2001లో ఓ హోటల్ వ్యాపారిని హత్య చేసిన కేసులో అతడిని దోషిగా తేల్చిన కోర్టు జీవిత ఖైదు విధించింది. తాజాగా దాన్ని ఎత్తివేస్తూ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో బెయిల్ వచ్చినా అతడు జైలులోనే ఉండనున్నాడు. 2011లో ఓ జర్నలిస్టును హతమార్చిన కేసులోనూ అతడికి జీవిత ఖైదు పడింది.

Similar News

News October 23, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్.. అమలు ఇలా..

image

AP: ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 3 సిలిండర్లు కాకుండా 4 నెలలకొకటి ఇవ్వాలని నిర్ణయించింది. సిలిండర్‌కు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ఆ సబ్సిడీ మొత్తం ఖాతాల్లో డిపాజిట్ కానుంది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ.రూ.876 ఉండగా కేంద్రం సబ్సిడీ రూ.25 పోను మిగిలిన రూ.851 చొప్పున 3 సిలిండర్లకు ఏడాదికి రూ.2,553 ఖాతాల్లో జమ కానున్నాయి.

News October 23, 2024

ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

image

*దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
*ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు
*పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు ఆమోదం
*ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు చోటు
*శారదా పీఠం భూకేటాయింపుల రద్దు
*ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై చర్యలకు కమిటీ

News October 23, 2024

వారానికి 100 గంటలు పనిచేయాలి: మస్క్

image

పని ఒత్తిడి, అధిక పని గంటలతో శారీరకంగా, మానసికంగా కుంగిపోయి ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో వారానికి 100 గంటలు పని చేస్తేనే వేగంగా విజయాన్ని పొందొచ్చని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. ‘మీరు వారానికి 100 గంటలు పనిచేస్తే ఇతరులు 50 గంటలు పనిచేసిన దానికంటే రెట్టింపు ఫలితం సాధిస్తారు. నేను, నా సోదరుడు రాత్రుళ్లు కోడింగ్ చేసేవాళ్లం’ అని తెలిపారు. దీనిపై మీకామెంట్?