News August 27, 2024
కవితకు బెయిల్.. ED, CBIలకు మందలింపు

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో BRS MLC కవితకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు ED, CBIలను మందలించింది. ఆ దర్యాప్తు సంస్థల విచారణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అప్రూవర్లను సాక్షులుగా ఎంపిక చేసుకోవడాన్ని జస్టిస్ B.R.గవాయ్, జస్టిస్ K.V.విశ్వనాథన్ ధర్మాసనం తప్పుబట్టింది. అప్రూవర్లుగా మారిన నిందితుల సాక్ష్యాలను ఎలా పరిగణిస్తారంటూ ప్రశ్నించింది. విచారణ పారదర్శకంగా సాగాలని సూచించింది.
Similar News
News November 25, 2025
శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.