News August 27, 2024
బెయిర్ స్టో, మొయిన్ అలీపై ఇంగ్లండ్ వేటు

ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్కు బెయిర్ స్టో, మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయారు.
టీ20 జట్టు: బట్లర్(C), ఆర్చర్, జాకబ్, కార్సే, కాక్స్, సామ్ కరన్, జోష్, విల్ జాక్స్, లివింగ్ స్టోన్, సాకిబ్, మోస్లే, రషీద్, సాల్ట్, టోప్లీ, టర్నర్.
వన్డే జట్టు: బట్లర్(C), ఆర్చర్, అట్కిన్సన్, బెథెల్, బ్రూక్, కార్సే, డకెట్, జోష్, విల్ జాక్స్, పాట్స్, రషీద్, సాల్ట్, స్మిత్, టోప్లీ, టర్నర్.
Similar News
News November 25, 2025
ఆశ్లేష కురిస్తే ముసలియెద్దూ రంకెవేస్తుంది..

ఆశ్లేష నక్షత్రంలో ( జూలై చివరిలో/ ఆగస్టు ప్రారంభంలో) వర్షాలు బాగా పడితే, ఆ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయని, పచ్చగడ్డి, మేత పుష్కలంగా లభిస్తాయని రైతులకు నమ్మకం. ఈ సమృద్ధి కారణంగా, సాధారణంగా నీరసంగా లేదా బలహీనంగా ఉండే ముసలి ఎద్దులు కూడా కడుపునిండా తిని, కొత్త శక్తిని పొంది, సంతోషంతో ఉత్సాహంగా అరుస్తాయనేది ఈ సామెత భావం. మంచి రోజులు వచ్చినప్పుడు అందరూ సంతోషిస్తారని అర్థం
News November 25, 2025
శివుడి అవతారమే హనుమంతుడు

హనుమంతుడు అంజనా దేవి పుత్రుడు. శివుడి వంటి పుత్రుడిని పొందాలని పరమేశ్వరుడికి పూజలు చేసింది. ఆ పూజల ఫలితంగా శివుడి వరంతోనే హనుమంతుడు జన్మించాడు. ఆయనను శివుని అవతారంగా భావిస్తారు. శివుడి లాగే ఆయన కూడా పరిపూర్ణ యోగి. అష్ట సిద్ధులకు యజమాని. ఆయన తన దైవశక్తిని ఏనాడూ స్వార్థానికి ఉపయోగించలేదు. తన ప్రభువు రాముడిని సేవించడానికి మాత్రమే వినియోగించారు. ఆయనను పూజిస్తే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుందట.
News November 25, 2025
సీఎం రేవంత్ రెడ్డి నేటి షెడ్యూల్

TG: కీలక అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మంత్రులతో క్యాబినెట్ భేటీ నిర్వహించనున్నారు. ఉ.11 గంటలకు సెక్రటేరియట్లో ఈ సమావేశం ప్రారంభం కానుంది. పంచాయతీ ఎన్నికలు, విద్యుత్ రంగంపై చర్చించనున్నారు. అటు సాయంత్రం 5 గంటలకు HYDలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ‘తెలంగాణ రైజింగ్-2047’పై సీఎం సమీక్ష నిర్వహిస్తారు.


