News October 7, 2024
గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ ఆందోళన

INDvBAN టీ20 మ్యాచ్ జరిగిన గ్వాలియర్ స్టేడియం బయట బజరంగ్ దళ్ కార్యకర్తలు నల్ల జెండాలతో ఆందోళన చేశారు. బంగ్లాలో హిందువులపై దాడులు జరుగుతుంటే, ఆ దేశంతో క్రికెట్ ఆడటమేంటంటూ నినాదాలు చేశారు. మ్యాచ్ దృష్ట్యా ఎటువంటి నిరసనలు వ్యక్తం చేయరాదంటూ స్థానిక జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ నిరసనకారులు లెక్కచేయకపోవడం గమనార్హం. వారిలో పలువురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
Similar News
News January 31, 2026
ఈ నొప్పులతో థైరాయిడ్ను ముందుగానే గుర్తించొచ్చు

శరీరంలో కొన్నిభాగాల్లో వచ్చే నొప్పులు థైరాయిడ్ అసమతుల్యతకు సూచన అని నిపుణులు అంటున్నారు. సాధారణంగా థైరాయిడ్ హార్మోన్లలో అసమతుల్యత ఉంటే ఎముకలను బలహీనపరుస్తుంది. ఇది వివిధ ప్రదేశాలలో నొప్పికి దారితీస్తుంది. మెడ, దవడ, చెవి నొప్పులు తరచూ వస్తుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. వీటితో పాటు కండరాల నొప్పి, కీళ్లు, మోకాళ్ల నొప్పి ఎక్కువగా వస్తున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News January 31, 2026
Budget: హిస్టరీ క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

రేపు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించనున్నారు. ఇండియన్ హిస్టరీలో ఒకే ప్రధానమంత్రి (నరేంద్ర మోదీ) హయాంలో వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక ఆర్థిక మంత్రిగా అరుదైన రికార్డు నెలకొల్పనున్నారు. గతంలో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 10 సార్లు, చిదంబరం 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా.. అవి వేర్వేరు ప్రధానుల కాలంలో జరిగాయి.
News January 31, 2026
నేడు శని త్రయోదశి.. సాయంత్రం ఇలా చేయండి!

శనైశ్చరుడు విష్ణు భక్తుడు కావడంతో మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఈరోజు చేసే పరిహారాలు, దానాలు రెట్టింపు ఫలితాన్ని అందిస్తాయని పండితుల మాట. ‘సా.5.15-5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడల నుంచి త్వరగా విముక్తి లభిస్తుంది. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిక్కున నువ్వుల నూనెతో 8 ఒత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించుకోండి’ అని చెబుతున్నారు.


