News June 17, 2024

త్యాగనిరతికి ప్రతీక బక్రీద్: మంత్రి పవన్ కళ్యాణ్

image

AP: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలకు మంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రతి పండుగలో గొప్ప ధార్మిక సందేశం, విశిష్టత నిబిడీకృతమై ఉంటుంది. ఇస్లాంపై విశ్వాసం ఉన్నవారు రంజాన్‌ను ఎంత భక్తి, శ్రద్ధలతో జరుపుకొంటారో బక్రీద్‌నూ అంతే నిష్టతో చేస్తారు. ఈ పండుగ ముస్లింలందరికీ భగవదనుగ్రహం కలుగచేయాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పవన్ పేర్కొన్నారు.

Similar News

News March 30, 2026

విద్యార్థుల ఆకలి తీర్చేందుకు.. హాలిడేస్‌లో డ్రై రేషన్

image

AP: వేసవి సెలవుల్లోనూ కరవు మండలాల విద్యార్థుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 51 మండలాల్లో డ్రై రేషన్ స్కీమ్ అమలు చేయనుంది. ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి నెలకు 4 కిలోలు, ఉన్నత పాఠశాలల స్టూడెంట్స్‌కు 6 కిలోల చొప్పున బియ్యం, 35 గుడ్లు, 21 చిక్కీలు అందజేయనుంది. 2-10వ తరగతి మధ్య చదివే విద్యార్థులకు ఇది వర్తించనుంది.

News March 30, 2026

పెట్రోల్ బంకుల ద్వారా కిరోసిన్ పంపిణీ

image

యుద్ధం నేపథ్యంలో దేశంలో కిరోసిన్ వినియోగాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. పెట్రోల్ బంకుల్లో తాత్కాలికంగా 60రోజుల పాటు దీన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాలో 2బంకులు 5వేల లీటర్ల కిరోసిన్‌ను నిల్వ చేసుకునేలా నిబంధనలు సడలించింది. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ(PDS) ద్వారా కిరోసిన్ సప్లై చేయనుంది. PNG కోసం శనివారం 6వేల మంది స్వచ్ఛందంగా LPG కనెక్షన్లు వదులుకున్నట్లు కేంద్రం తెలిపింది.

News March 30, 2026

హార్ముజ్‌లో ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’

image

హార్ముజ్ జలసంధి నుంచి భారతీయ నౌకలను సేఫ్‌గా తీసుకొచ్చేందుకు నేవీ ‘ఆపరేషన్ ఊర్జా సురక్ష’ చేపడుతోంది. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో నాలుగు నుంచి ఐదు యుద్ధనౌకలను నేవీ రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. భారతీయ మర్చంట్ నౌకలు.. ముఖ్యంగా చమురు వంటి కీలక వనరులు ఉన్న షిప్పులను దాటించేందుకు వీటిని ఉపయోగించనున్నారు. ఒమన్ గల్ఫ్ వద్ద ప్రస్తుతం ఇవి ఆపరేట్ అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు.