News April 6, 2024

12 నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

image

AP: ఈ నెల 12వ తేదీ నుంచి టీడీపీ నేత, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కదిరి నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.

Similar News

News October 13, 2025

రెండో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

image

రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్యాంప్‌బెల్(115), షై హోప్(103) సెంచరీలు చేశారు. చివరి వికెట్‌కు గ్రీవ్స్(50*), సీల్స్ (32) అద్భుతంగా పోరాడి 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో WI భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.

News October 13, 2025

ఎకనామిక్ సైన్సెస్‌లో ముగ్గురికి నోబెల్

image

ఎకనామిక్ సైన్సెస్‌లో జోయెల్ మోకైర్, ఫిలిప్ అగియోన్, పీటర్ హోయిట్‌ను నోబెల్ ప్రైజ్ వరించింది. ఇన్నోవేషన్ ఆధారిత ఎకనామిక్ గ్రోత్‌ను వివరించినందుకు గాను వారికి ఈ పురస్కారం దక్కింది. ప్రైజ్‌లో మోకైర్‌కు అర్ధభాగం, అగియోన్, పీటర్‌కు సంయుక్తంగా మరో అర్ధభాగాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ఇప్పటికే కెమిస్ట్రీ, ఫిజిక్స్, మెడిసిన్, <<17966688>>పీస్<<>>, లిటరేచర్ అవార్డులు ప్రకటించడం తెలిసిందే.

News October 13, 2025

ఏపీ అప్‌డేట్స్

image

☛ లిక్కర్ స్కామ్ కేసు నిందితులకు ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగింపు.. న్యూయార్క్ వెళ్లేందుకు MP మిథున్ రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు కోర్టు ఆదేశం
☛ రేపు, ఎల్లుండి రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో మంత్రి దుర్గేశ్ పర్యటన.. నేషనల్ టూరిజం కాన్ఫరెన్స్‌లో పాల్గొననున్న మంత్రి
☛ పశుసంవర్ధక శాఖలో 157 మంది ల్యాబ్ టెక్నీషియన్ల కాంట్రాక్టు సర్వీసులు మరో ఏడాది పాటు పొడిగింపు