News April 13, 2024
నేటి నుంచి బాలకృష్ణ ఎన్నికల ప్రచారం

AP: సినీనటుడు, హిందూపురం MLA నందమూరి బాలకృష్ణ ఇవాళ్టి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో చేపట్టనున్న ఈ ప్రచారం కోసం ‘బాలయ్య అన్‌స్టాపబుల్’ పేరుతో స్పెషల్ బస్సును రూపొందించారు. NDA అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు రాయలసీమలో ఆయన పర్యటించనున్నారు. ఈనెల 19న హిందూపురం అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయనున్నారు. ఆ తర్వాత 25 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారు.
Similar News
News January 9, 2026
DGPకి హైకోర్టులో ఊరట

TG: DGP శివధర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. నాలుగు వారాల్లో DGP పూర్తిస్థాయి నియామకం జరగాలని UPSC సహా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
News January 9, 2026
టికెట్ రేట్ల పెంపు.. ఇరు వైపుల నుంచి విమర్శలు

‘Rajasaab’ టికెట్ రేట్ల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి. అఖండ2కు హైక్‌పై హైకోర్టు చీవాట్లతో ఇకపై టికెట్ రేట్లు పెంచబోమని సినిమాటోగ్రఫీ మంత్రి వెంకట్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నిసార్లు ప్రకటించి పక్కనబెడతారు అని ప్రజలు, విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ రిలీజ్ ఉంటే 8న అర్ధరాత్రి తర్వాత పర్మిషన్ వస్తే ఏం లాభమని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. మీ Comment?
News January 9, 2026
వీరు సూర్యుడిని పూజిస్తే విశేష ఫలితాలు

జాతకంలో వివాహ పరిబంధన దోషం, పుత్ర దోషం, పుత్ర పరిబంధన దోషం, విద్యా, ఉద్యోగ పరిబంధన దోషాలతో పాటు సూర్య దోషం ఉన్నవారు ఆదివారం నాడు సూర్య భగవానుడిని ఆరాధించాలి. ప్రతి ఆదివారం సూర్యోదయం వేళ అర్ఘ్యం సమర్పించి, ఆదిత్య హృదయం పఠించడం వల్ల ఈ దోషాల తీవ్రత తగ్గుతుంది. క్రమం తప్పకుండా సూర్యారాధన చేస్తే జీవితంలో ఆటంకాలు తొలగి, విద్య, ఉద్యోగ, వివాహ రంగాల్లో శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.


