News August 5, 2024
‘ఆవేశం’ రీమేక్‌లో బాలకృష్ణ?

మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘ఆవేశం’ సినిమా రీమేక్‌లో నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు టీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకూ తెగ నచ్చేసింది. దీంతో దీనిని రీమేక్ చేసేందుకు డైరెక్టర్ హరీశ్ శంకర్ సిద్ధమయ్యారట. ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో బాలయ్య NBK109లో నటిస్తున్నారు. హరీశ్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేనితో మూవీ తర్వాత ఈ ప్రాజెక్టును చేపడతారట.
Similar News
News March 3, 2026
‘హార్ముజ్’ సంక్షోభం.. ఇండియాకు అండగా రష్యా!

హార్ముజ్ జలసంధిని ఇరాన్ <<19285220>>మూసివేసిన<<>> నేపథ్యంలో ఇండియాకు సాయం చేసేందుకు రష్యా ముందుకొచ్చింది. చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తాము క్రూడ్ పంపుతామని రష్యన్ వర్గాలు చెప్పినట్లు రాయిటర్స్ తెలిపింది. మరోవైపు ఆయిల్ కొరత ఏర్పడితే రష్యా నుంచి ఇండియా దిగుమతులు పెంచవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఇండియా క్రూడాయిల్, పెట్రోలియం <<19289613>>నిల్వలు<<>> 40-45 రోజులు వస్తాయని సమాచారం.
News March 3, 2026
అప్పుడు నా కెరీర్ ముగిసిందనుకున్నా: స్నేహ

తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ జీవితాన్ని తలకిందులు చేసిందని నటి స్నేహ వెల్లడించారు. ‘వరుస సినిమాలతో(2002) బిజీగా ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. తీవ్ర గాయాలవడంతో 8 నెలలు మంచానికి పరిమితమయ్యా. నా కెరీర్ ముగిసిందనుకున్నా. కానీ డైరెక్టర్ కరు పళనియప్పన్ “పార్థిబన్ కనవు”(2003) మూవీలో అవకాశం ఇవ్వడంతో మళ్లీ కెమెరా ముందుకు రాగలిగా’ అని ఇటీవల ఓ ప్రోగ్రామ్‌లో గుర్తుచేసుకున్నారు.
News March 3, 2026
ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఎందుకు దాడులు చేయట్లేదు?

ఖురాన్‌లో Muslim Ummah అనే విధానం ఉంది. అంటే ప్రపంచంలోని అందరూ ముస్లింలు ఒకే సమూహం/సమాజానికి చెందినవారు అని అర్థం. ఒక దేశానికి కష్టం వస్తే మరో దేశం సహకరించుకుంటాయి. ఒక ముస్లిం దేశంపై మరొక ముస్లిం దేశం దాడి చేయడం Ummah సిద్ధాంతానికి విరుద్ధమని చాలా మంది భావిస్తారు. ఇప్పుడు ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు యుద్ధం ప్రారంభిస్తే ఇజ్రాయెల్‌కు సహకరిస్తున్నాయనే ముద్ర పడుతుంది. ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోతాయి.


