News May 26, 2024

సీఎం రేవంత్‌తో బాలకృష్ణ భేటీ

image

TG: సీఎం రేవంత్ రెడ్డితో నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఎన్నికల సరళిపై చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 7, 2025

ATP: డిసెంబర్‌లో పెళ్లి.. అంతలోనే!

image

డిసెంబర్‌లో పెళ్లి జరగాల్సిన ఓ ఇంట్లో విషాదం నెలకొంది. రాబోయే కొత్త జీవితం కోసం కలలు కన్న రామును కోల్పోవడం కుటుంబానికి తట్టుకోలేని విషాదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపప్పూరు(M) చాగల్లులో గ్రామానికి చెందిన రాము(23) గురువారం టెంకాయ చెట్టును కొడుతుండగా విద్యుత్తు వైర్లు తగిలి షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

News November 7, 2025

APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

image

చెన్నై ఆవడిలోని ఆర్మ్‌డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<>AVNL<<>>) 5 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 22 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ(CS)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు 300, SC, ST, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in/

News November 7, 2025

రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

image

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.