News June 11, 2024

అల్లుడి కోసం బాలకృష్ణ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు: కేఏ పాల్

image

AP: వైజాగ్‌లో అల్లుడిని గెలిపించేందుకు బాలకృష్ణ ఈవీఎంల ట్యాంపరింగ్ చేశారని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రధాని అయ్యే అవకాశాన్ని జూన్ 5నే కోల్పోయారని చెప్పారు. టీడీపీని, జేడీయూను వాడుకొని మోదీ అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీకి స్పెషల్ స్టేటస్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి హామీలు నెరవేర్చాలని మోదీని CBN అడిగి ఉంటే బాగుండేదని చెప్పారు.

Similar News

News September 11, 2025

ఆ ప్రచారాన్ని ఖండించిన మాస్టర్ బ్లాస్టర్

image

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ BCCI తదుపరి ప్రెసిడెంట్ కాబోతున్నారంటూ కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఈ ప్రచారానికి తాజాగా సచిన్ తెరదించారు. ఆయనకు చెందిన SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘సచిన్‌‌కు సంబంధించి పలు రిపోర్ట్స్, రూమర్స్ మా దృష్టికి వచ్చాయి. అవన్నీ అవాస్తవాలు. ఊహాగానాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నాం’ అని పేర్కొంది.

News September 11, 2025

రేపు Way2News కాన్‌క్లేవ్‌కు సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు రేపు విజయవాడలో నిర్వహించే Way2News కాన్‌క్లేవ్‌కు హాజరు కానున్నారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి ఆయన ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆ కార్యక్రమం ముగించుకొని మ. 3గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా కాన్‌క్లేవ్‌కు రానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి రానున్న దశాబ్ద కాలంలో అవలంబించాల్సిన విధివిధానాల గురించి చర్చించనున్నారు.

News September 11, 2025

ఉత్తరాఖండ్‌కు రూ.1200 కోట్ల ఆర్థిక సాయం

image

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌కు ప్రధాని మోదీ రూ.1200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రకృతి విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇవాళ డెహ్రాడూన్ వెళ్లిన ప్రధాని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. అంతకుముందు పంజాబ్‌కు రూ.1600 కోట్లు, హిమాచల్‌ప్రదేశ్‌కు రూ.1500 కోట్లు ప్రకటించారు.