News April 19, 2024
బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63కోట్లు
AP: హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు. తన పేరిట రూ.81.63 కోట్ల ఆస్తులున్నాయని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140.38 కోట్లు అని, కొడుకు మోక్షజ్ఞ ఆస్తులు రూ.58.63 కోట్లు అని తెలిపారు. తనకు రూ.9.9కోట్లు, తన భార్యకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నాయని వెల్లడించారు.
Similar News
News November 19, 2024
నేడు వరంగల్‌లో సీఎం రేవంత్ పర్యటన
TG: ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ వరంగల్‌లో ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహిస్తోంది. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగే ఈ సభలో CM రేవంత్ పాల్గొననున్నారు. ఇవాళ ఇందిరా గాంధీ జయంతి నేపథ్యంలో సభా వేదికకు ‘ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం’గా పేరు పెట్టారు. ఈ సభకు దాదాపు లక్ష మంది హాజరవుతారని అంచనా. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.
News November 19, 2024
మెటాకు రూ.213 కోట్ల ఫైన్
వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ₹213కోట్ల జరిమానా విధించింది. ప్రైవసీ పాలసీకి సంబంధించి 2021లో ఆ సంస్థ తీసుకొచ్చిన అప్‌డేట్ అనైతికం అని పేర్కొంది. ఈ అప్‌డేట్ ప్రకారం యూజర్లు తమ వాట్సాప్ డేటాను ఇతర మెటా కంపెనీలతో షేర్ చేసుకునేందుకు తప్పనిసరిగా అంగీకరించాలి. అయితే ఈ విషయంలో యూజర్లదే తుది నిర్ణయమని, 2016 నాటి విధానానికి భిన్నంగా కొత్త విధానాన్ని అమలు చేసినందుకు ఫైన్ వేసింది.
News November 19, 2024
టీటీడీ నిర్ణయం హర్షణీయం: పవన్ కళ్యాణ్
AP: తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ <<14644612>>టీటీడీ తీసుకున్న నిర్ణయం<<>> హర్షణీయం అని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఎన్నికల సమయంలో నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, వారికి తాను హామీ ఇచ్చానని పేర్కొన్నారు. ‘తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ, ఆ దిశగా అధికార యంత్రాగాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.