News May 10, 2024
అక్షయ తృతీయ రోజున బాలరాముడు

పవిత్రమైన అక్షయ తృతీయ రోజున అయోధ్యలోని బాలరాముడు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. బంగారు దారాలను ఉపయోగించి అస్సాంలో తయారు చేసిన ప్రత్యేక వస్త్రాలతో బాలక్ రామ్‌ని ముస్తాబు చేసినట్లు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సుదర్శన చక్రం, గద, శంఖం వంటి వాటిని కలిగి ఉన్న బాలరాముడు స్వర్ణ ఆభరణాలతో కాంతులీనుతున్నారు.
Similar News
News March 27, 2026
ఏప్రిల్ 21లోగా ఇంటర్ ఫలితాలు!

AP: ఇంటర్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్‌ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే తొలి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా ఇంటర్ ఫస్ట్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
News March 27, 2026
ధరలను నియంత్రించేందుకే ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం: కేంద్రం

ధరల పెరుగుదల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు పెట్రోల్, డీజిల్‌పై <<19487934>>ఎక్సైజ్ డ్యూటీ<<>> తగ్గించామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు 21.5, జెట్ ఫ్యూయల్ ఎగుమతులపై లీటర్‌కు 29.5 చొప్పున సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల చమురు కంపెనీలు తమ ఉత్పత్తిని అంతర్జాతీయ మార్కెట్‌కు అమ్ముకోకుండా దేశీయ అవసరాలకు ప్రాధాన్యం ఇస్తాయని పేర్కొన్నారు.