News June 4, 2024
మహబూబాబాద్‌లో బలరాంనాయక్ ముందంజ

TG: మహబూబాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాంనాయక్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి 33,753ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం.
Similar News
News April 19, 2026
కోతుల బెడద.. ఇంటికి రూ.500 వసూలు చేసి..

TG: ప్రస్తుతం ప్రతీ గ్రామాన్ని కోతుల సమస్య వేధిస్తోంది. కోతులు ఇళ్లలోకి చొరబడుతుండటం, మనుషులపై దాడులు చేస్తుండటం గ్రామస్థులను కలవరపెడుతోంది. దీని పరిష్కారం కోసం మహబూబాబాద్(D) నర్సింహులపేటలో గ్రామస్థులంతా ఏకమై చందాలు సేకరించారు. ‘కోతుల తరలింపు కార్యక్రమం’ పేరిట ఇంటికి రూ.500, ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేశారు. నిపుణుల బృందంతో కోతులను పట్టించి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
News April 19, 2026
పుష్ప-2 రికార్డు బ్రేక్ చేసిన ధురంధర్-2

రణ్‌వీర్ సింగ్ నటించిన ధురంధర్-2 సినిమా మరో మైలురాయిని దాటేసింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో పుష్ప-2(₹1,742Cr)ను బీట్ చేసింది. ₹1748Cr కలెక్షన్లతో మూడో స్థానానికి చేరింది. తొలి రెండు స్థానాల్లో దంగల్(₹2,090Cr), బాహుబలి:2(₹1,788Cr) ఉన్నాయి. కాగా ఇప్పటికే ₹3,000+Cr గ్రాస్ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ ఫ్రాంచైజీగా ‘ధురంధర్’ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే.
News April 19, 2026
ఏపీ విభజన వ్యాఖ్యల వివాదం.. తేజస్వీ సూర్య ఏమన్నారంటే?

తెలంగాణను ఉద్దేశించి లోక్‌సభలో తాను చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడంపై BJP MP తేజస్వీ సూర్య స్పందించారు. ‘కాంగ్రెస్ నిరక్షరాస్యుల పార్టీ. నేనేం మాట్లాడానో ఆ పార్టీ నేతలు మళ్లీ వినండి. ఆ సింపుల్ మాటలను వీలైతే అర్థం చేసుకోండి. INC లీడర్లు ఉద్దేశపూర్వకంగా, అజ్ఞానంతో నిరసన తెలుపుతున్నారు’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఉమ్మడి APని IND, PAK తరహాలో విభజించారని తేజస్వీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.


