News June 23, 2024

లోక్‌సభలో టీడీపీ విప్‌గా బాలయోగి తనయుడు

image

AP: లోక్‌సభలో టీడీపీ విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్‌ మాథుర్‌ని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. గతంలో హరీశ్ తండ్రి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. సభను హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీశ్‌కి విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీశ్ ఎంపీగా గెలుపొందారు.

Similar News

News November 28, 2025

చెక్క దువ్వెన వాడుతున్నారా?

image

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్‌ లిక్విడ్‌/ షాంపూ, కొబ్బరి, ఆలివ్‌ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.

News November 28, 2025

మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

image

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.

News November 28, 2025

వైకుంఠ ద్వార దర్శనం.. ఎంత పుణ్యమో తెలుసా?

image

వైష్ణవాలయాల్లో ఏడాదంతా మూసి ఉండే ఉత్తర ద్వారాలు వైకుంఠ ఏకాదశి నాడు తెరుచుకుంటాయి. శ్రీవారి దర్శనార్థం 3 కోట్ల దేవతల రాకను సూచిస్తూ వీటిని తెరుస్తారు. ఇందులో నుంచి వెళ్లి స్వామిని దర్శించుకుంటే స్వర్గంలోకి ప్రవేశించినంత పవిత్రంగా భావిస్తారు. అలాగే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఇందుకు సంబంధించి టికెట్లను TTD నిన్న విడుదల చేసింది. ☞ వాటిని ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.