News August 28, 2024
బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు.. బన్నీకి ఆహ్వానం

నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు అల్లు అర్జున్‌కు ఆహ్వానం అందింది. సెప్టెంబర్ 1న HYD నోవాటెల్ హోటల్లో జరిగే ఈ సెలబ్రేషన్స్‌కు హాజరుకావాలని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు ఆయనను ఆహ్వానించారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, మహేశ్ బాబు, రాంచరణ్, రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, షారుఖ్ ఖాన్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ తదితర నటులకు ఇన్విటేషన్లు అందాయి.
Similar News
News January 25, 2026
శుభాంశు శుక్లాకు అశోక చక్ర

77వ రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ముర్ము ప్రకటించారు. గతేడాది అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన శుభాంశు శుక్లా(పైలట్)కు అశోక చక్ర అవార్డు వరించింది. ముగ్గురికి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర, ఒకరికి బార్ టు సేనా మెడల్(గ్యాలంటరీ), 44 మందికి సేనా మెడల్, ఆరుగురికి NAO సేనా మెడల్, ఇద్దరికి వాయు సేనా మెడల్ అందించనున్నారు.
News January 25, 2026
17న ఫ్రీగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ

AP: వచ్చే నెల 17న రాష్ట్రంలో 1-19 ఏళ్లలోపు ఉన్న 1.11 కోట్ల మందికి ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు. వీరిలో ఐదేళ్లలోపు పిల్లలు 23 లక్షల మంది ఉన్నారన్నారు. ‘నులిపురుగుల వల్ల ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, రక్తహీనత, ఎదుగుదల లోపం వంటి సమస్యలు వస్తాయి. ఆల్బెండజోల్ మాత్రలతో వీటిని నివారించవచ్చు’ అని పేర్కొన్నారు.
News January 25, 2026
అభిమానికి గోల్డ్ చైన్ ఇచ్చిన రజినీకాంత్

సూపర్‌స్టార్ రజినీకాంత్ తన అభిమానికి బంగారు గొలుసు ఇచ్చారు. మధురైలో పేదల కోసం కేవలం రూ.5కే పరోటా విక్రయిస్తున్న ‘రజినీ శేఖర్’ సేవలను ప్రశంసించారు. శేఖర్ కుటుంబాన్ని చెన్నైలోని తన నివాసానికి ఆహ్వానించి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ ‘జైలర్ 2’ మూవీతో బిజీగా ఉండగా, ఏప్రిల్ నుంచి సిబి చక్రవర్తి దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.


