News March 30, 2024
శర్వానంద్ సినిమాకు బాలయ్య మూవీ టైటిల్?

యువనటుడు శర్వానంద్ ‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి నందమూరి బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను వాడుకోవాలని అనుకుంటున్నారట మూవీ టీమ్. అబ్బరాజు తన గత సినిమాకు కూడా సామజవరగమన వంటి అచ్చ తెలుగు టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News April 1, 2026
మేం ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు: జగన్

AP: అమరావతికే కాకుండా రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ తాము వ్యతిరేకం కాదని ప్రెస్మీట్లో YCP చీఫ్ జగన్ స్పష్టం చేశారు. ‘అమరావతి పేరుపై అప్పులు తెచ్చి స్కామ్‌లు చేస్తున్నారు. లక్ష ఎకరాల్లో రోడ్లు, నీళ్లు, డ్రైనేజీకి రూ.2లక్షల కోట్లు కావాలి. అంత ఖర్చు చేసే స్థోమత మనకు ఉందా? ఏడేళ్లలో CBN ఖర్చు పెట్టింది రూ.8వేల కోట్లే. వీటికి అసెంబ్లీలో CBN సమాధానం చెప్పాడా?’ అని ప్రశ్నించారు.
News April 1, 2026
టీ తోటలో మోదీ.. కార్మికులతో ముచ్చట్లు

అస్సాం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ దిబ్రూగఢ్‌లోని టీ తోటలను సందర్శించారు. అక్కడ తేయాకు కోస్తున్న మహిళా కార్మికులతో ముచ్చటించారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న మోదీ.. అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడంలో వారి శ్రమ అమూల్యమైనదని కొనియాడారు. తోటల్లో మహిళలతో కలిసి సరదాగా కాసేపు తేయాకు కోశారు. ఈ ఫొటోలను Xలో షేర్ చేశారు.
News April 1, 2026
IPL: శ్రేయస్ అయ్యర్‌కు ఫైన్

IPL-19 సీజన్లో తొలిసారి PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు BCCI ఫైన్ విధించింది. నిన్న GTతో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేట్ ల రూ.12లక్షల ఫైన్ వేసింది. PBKS 19వ ఓవర్ చేరుకునేటప్పటికే అంపైర్ స్లో ఓవర్ వార్నింగ్ ఇవ్వగా ఆపై <<19529168>>అర్ష్‌దీప్<<>> మరింత ఆలస్యం చేశారు.


