News November 12, 2024
బాలయ్య కొత్త సినిమా టీజర్ ఎప్పుడంటే?

నందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తోన్న ‘NBK109’ నుంచి అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర టైటిల్ & టీజర్‌ను ఈనెల 15న ఉదయం 10.24గంటలకు విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందించగా నాగవంశీ నిర్మించారు.
Similar News
News February 2, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News February 2, 2026
శత్రు విజయం సాధించాలంటే ఏ దీపం?

శత్రువులపై విజయం సాధించాలన్నా, ఇతరుల నుంచి వచ్చే ఒత్తిడిని అధిగమించాలన్నా మినప పిండితో చేసిన దీపాన్ని వెలిగించాలి. ఈ దీపానికి దుష్ట శక్తులను, నరదిష్టిని తొలగించే శక్తి ఉంది. కుజ దోషం లేదా జాతకంలో రాహు-కేతు ప్రభావం వల్ల కలిగే ఆటంకాలను ఇది నివారిస్తుంది. భయం, ఆందోళనలు ఉన్నవారు మినప పిండి దీపాన్ని వెలిగించడం వల్ల ధైర్యం పొందుతారు. ఇది రక్షణ కవచంలా పనిచేసి కార్యసిద్ధిని కలిగిస్తుంది.
News February 2, 2026
NPCILలో 114 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (<


