News January 13, 2025

బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ అదుర్స్

image

నందమూరి బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్సులో అదరగొడుతున్నారు. అఖండ నుంచి వరుసగా 4 సినిమాలు హిట్ అయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా డాకు మహారాజ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. వీటికి ముందు ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ మూవీలతో బాలయ్య పరాజయాలను ఎదుర్కొన్నారు. బాలకృష్ణ తన తర్వాతి సినిమా బోయపాటితో అఖండ-2 చేయబోతున్నారు.

Similar News

News January 10, 2026

రివ్యూ ఆప్షన్ నిలిపివేత.. కారణం ఇదే

image

సినిమా రివ్యూల పేరిట జరుగుతున్న ‘డిజిటల్ మాఫియా’కు అడ్డుకట్ట వేస్తూ టాలీవుడ్‌లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కొందరు కావాలనే సినిమాలను టార్గెట్ చేస్తూ ఇచ్చే తప్పుడు రివ్యూలు, నెగటివ్ రేటింగ్స్ వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్ర బృందం కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆదేశాలతో బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో రివ్యూ ఆప్షన్‌ను నిలిపివేశారు.

News January 10, 2026

కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ ఆహ్వానం

image

TG: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అరుదైన గౌరవం దక్కింది. USలోని హార్వర్డ్ యూనివర్సిటీ 23వ ఇండియా కాన్ఫరెన్స్ ఎట్ హార్వర్డ్‌లో ప్రసంగించాలని నిర్వాహకులు ఆహ్వానం అందించారు. FEB 14, 15 తేదీల్లో జరిగే సదస్సులో పాల్గొనాలని కోరారు. INDతో పాటు దక్షిణ ఆసియా దేశాల విద్యార్థులు, వ్యాపారవేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. KTR గతంలోనూ పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించారు.

News January 10, 2026

భక్తి, ఎదురుచూపులకి నిదర్శనం ‘శబరి’

image

శబరి శ్రీరాముని దర్శనం కోసం ఏళ్ల తరబడి వేచి చూసింది. వృద్ధాప్యం పైబడ్డా, కంటిచూపు మందగించినా ఆమెలో రామనామ స్మరణ తగ్గలేదు. రాముడు వస్తాడన్న ఆశతో రోజూ ఆశ్రమాన్ని శుభ్రం చేస్తూ, మధుర ఫలాలను సేకరించేది. చివరకు రాముడు రానే వచ్చాడు. ఆమె ఎంతో ప్రేమిస్తూ, రుచి చూసి ఇచ్చిన ఎంగిలి పండ్లను రాముడు తృప్తిగా స్వీకరించాడు. శబరి నిష్కల్మష భక్తికి మెచ్చిన రాముడు, ఆమెకు మోక్షాన్ని ప్రసాదించి పునీతురాలిని చేశాడు.