News August 7, 2024

జాతీయ పక్షిగా ‘బాల్డ్ ఈగల్‌’.. US సెనేట్ ఆమోదం

image

బాల్డ్ ఈగల్‌ను తమ జాతీయ పక్షిగా ఆమోదిస్తూ అమెరికా సెనేట్ బిల్లు పాస్ చేసింది. మిన్నెసొటా సభ్యురాలు అమీ క్లొబుచార్ ఈ ప్రతిపాదన తీసుకురాగా సెనేట్ సభ్యులందరూ ఏకపక్షంగా ఆమోదించారు. చట్టసభలోనూ పాస్ అయితే బిల్లు చట్టరూపం దాల్చనుంది. సుమారు 240 ఏళ్లుగా అమెరికాకు బాల్డ్ ఈగల్ సంకేతంగా ఉందని ఈ సందర్భంగా సెనేటర్లు గుర్తుచేసుకున్నారు. గద్ద జాతికి చెందిన బాల్డ్ ఈగల్ అమెరికాలోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది.

Similar News

News March 17, 2026

అసెంబ్లీ ముందుకు గిగ్ వర్కర్ల బిల్లు!

image

TG: గిగ్ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా, ఆరోగ్య పథకాలు అందించే బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి ఆమోదం లభించేలా చేసి, మేడే లోపు చట్టాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా 3-4 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. HYDలో వెల్ఫేర్ బోర్డు, వారిని వ్యవస్థీకృత పరిధిలోకి తెచ్చేందుకు ప్రత్యేక సైట్, యాప్‌ను సర్కార్ సిద్ధం చేస్తోంది.

News March 17, 2026

విజయ్-రష్మిక హల్దీ వేడుకల ఫొటోలు.. వైరల్

image

గత నెలలో పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ-రష్మిక తమ హల్దీ వేడుక ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఆ రోజు హల్దీ+హోలీ మాదిరిగా రంగుల్లో తడిసిపోయామని రష్మిక పేర్కొన్నారు. ఇప్పటికీ తన జుట్టు ఎరుపు రంగులోనే ఉందన్నారు. అద్భుతమైన వేడుకలకు సహకరించిన సిబ్బందికి థాంక్స్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.