News August 21, 2024
సుప్రీం తీర్పును బాలినేని తప్పుగా అర్థం చేసుకున్నారు: EC

AP: సుప్రీంకోర్టు తీర్పును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి, EVMలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. తాను పోటీ చేసిన ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 12 ఈవీఎంలు, వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించారు.
Similar News
News September 18, 2025
ప్రజల గొంతు వినాలని ప్రభుత్వానికి లేదు: జగన్

AP: అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి ప్రభుత్వానికి లేదని YCP చీఫ్ జగన్ విమర్శించారు. ఆయన అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే సభలో మాట్లాడేందుకు టైం ఉంటుంది. ఆ గుర్తింపు ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు రావట్లేదు. కానీ మండలిలో మనకు మంచి బలం ఉంది. మండలి సభ్యుల పాత్ర చాలా కీలకం. సభ్యులకు కూడా రాజకీయంగా ఎదగడానికి మంచి అవకాశం’ అని అన్నారు.
News September 18, 2025
హిండెన్‌బర్గ్ కేసు.. అదానీకి సెబీ క్లీన్చిట్

అదానీ గ్రూప్‌నకు సెబీ క్లీన్చిట్ ఇచ్చింది. ఛైర్మన్ గౌతమ్ అదానీపై షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల కేసును కొట్టేసింది. కాగా అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లను మ్యానిపులేట్ చేస్తూ డొల్ల కంపెనీలతో నిధులను సమీకరిస్తోందని 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ సంచలన ఆరోపణలు చేసింది. ఇది భారత మార్కెట్లను కుదిపేసింది. దీంతో సెబీ రంగంలోకి దిగింది. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని తాజాగా వెల్లడించింది.
News September 18, 2025
నాగార్జున 100వ మూవీపై క్రేజీ అప్డేట్!

అక్కినేని నాగార్జున నటించనున్న వందో సినిమాలో ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ మూవీకి ‘కింగ్100’ అనే టైటిల్ ఖరారైందని, దీనిని ఆర్.కార్తీక్ డైరెక్ట్ చేస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. చిరంజీవి చేతుల మీదుగా ఈ మూవీ లాంచ్ ఉంటుందని సమాచారం. ఆర్.కార్తీక్ గతంలో ‘ఆకాశం’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు.