News March 13, 2025
Balochistan Fight: పాకిస్థాన్, చైనా దోచుకుంటున్నాయని..!

పాకిస్థాన్, చైనా కలిసి తమను దోపిడీ చేస్తున్నాయనేది బలూచిస్థాన్ జాతీయవాదుల ఆవేదన. ఆ ప్రాంతంలో బొగ్గు, సహజవాయువు, బంగారం, రాగి లాంటి ఖనిజాలు భారీగా ఉంటాయి. వాటిని దోచుకుంటూ తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయట్లేదని అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. అరేబియా సముద్రంతో లింక్ కోసం చైనా బలూచిస్థాన్‌లో గ్వాదర్ పోర్ట్ నిర్మిస్తోంది. ఇది CPECలో చాలా కీలకమైన ప్రాజెక్టు. వారి కోపానికి ఇదీ ఓ ప్రధాన కారణం.
Similar News
News January 20, 2026
గ్రీన్లాండ్కు US యుద్ధ విమానం.. బలగాలను పెంచిన డెన్మార్క్

గ్రీన్లాండ్లోని పిటుఫిక్ స్పేస్ బేస్‌కు అమెరికా తన యుద్ధ విమానాన్ని పంపింది. నార్త్ అమెరికా రక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు NORAD తెలిపింది. మరోవైపు డెన్మార్క్ కూడా గ్రీన్లాండ్కు అదనపు సైన్యాన్ని, మిలిటరీ ఎక్విప్మెంట్ను తరలించింది. గ్రీన్‌లాండ్‌ను దక్కించుకోవాలని ట్రంప్ చూస్తున్న తరుణంలో ఇరు దేశాలు తమ మిలిటరీ పవర్‌ను పెంచడం ఉత్కంఠ రేపుతోంది.
News January 20, 2026
HURLలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ ఉర్వరిక్& రసాయన్ లిమిటెడ్ (<
News January 20, 2026
డిజాస్టర్‌గా ‘రాజాసాబ్’?

రూ.400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘రాజాసాబ్’ థియేట్రికల్ రన్‌ను డిజాస్టర్‌గా ముగించనుంది. JAN 9న విడుదలైన మూవీ 55% వసూళ్లతో బిజినెస్ క్లోజ్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు తెలిపాయి. థియేటర్లలో 20% ఆక్యుపెన్సీ కూడా ఉండట్లేదని పేర్కొన్నాయి. బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్‌గా నిలిచేందుకు ఇంకా రూ.90కోట్లు(నెట్) రావాలన్నాయి. మరోవైపు OTT డీల్ ఆశించినంత మేర జరగలేదని ప్రొడ్యూసర్ పేర్కొన్నారని చెప్పాయి.


