News November 28, 2024
ఇస్కాన్ను నిషేధించండి: బంగ్లా హైకోర్టు ఏం చేసిందంటే..

ఇస్కాన్పై నిషేధానికి బంగ్లాదేశ్ హైకోర్టు నిరాకరించినట్టు ది డైలీ స్టార్ తెలిపింది. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా స్వచ్ఛంద నిషేధం విధించాలని సుప్రీంకోర్టు లాయర్ మహ్మద్ మునీరుద్దీన్ కోర్టును కోరారు. ఛాటోగ్రామ్, రంగాపూర్, దినాజ్పూర్లో 144 సెక్షన్ను అమలు చేయాలన్నారు. నిర్ణయం తీసుకొనేముందు రాజ్యాంగపరమైన చిక్కుల్ని పరిగణనలోకి తీసుకోవాలని AG అసదుజ్జమాన్ చెప్పడంతో కోర్టు మరిన్ని వివరాలు కోరింది.
Similar News
News October 22, 2025
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది: రేణూ దేశాయ్

రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం ఉందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను డబ్బుకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వనని, జాగ్రత్తగా ఖర్చు పెడతానని తెలిపారు. ఆధ్యాత్మికతకు ప్రియారిటీ ఇస్తానని తెలిపారు. గతంలో రెండో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె <<16044331>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
News October 22, 2025
బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్

సీనియర్ సిటిజన్(60 ఏళ్లు పైబడిన) నూతన యూజర్ల కోసం BSNL కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. రూ.1,812తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు రోజూ 2GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 SMSలు అందించనుంది. దీంతోపాటు BiTV సబ్స్క్రిప్షన్ 6 నెలల పాటు ఉచితంగా అందించనుంది. వచ్చే నెల 18 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. అటు కొత్త యూజర్లకు రూ.1కే <<18014372>>రీఛార్జ్<<>> ఆఫర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News October 22, 2025
అక్టోబర్ 22: చరిత్రలో ఈరోజు

1901: ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం జయంతి
1998: బాలీవుడ్ నటుడు అజిత్ ఖాన్ మరణం
2001: సినీ నటుడు రామకృష్ణ మరణం
2008: చంద్రుడి పైకి మానవరహిత చంద్రయాన్-1ను ప్రయోగించిన ఇస్రో
➣అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం