News July 29, 2024
బాల్య వివాహాల నిషేధం అన్ని మతాలకూ వర్తిస్తుంది: కేరళ హైకోర్టు

దేశంలో ఎవరైనా ముందు భారత పౌరులని, ఆ తర్వాత ఒక మతంలోని సభ్యులని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ ఇలా మతాలతో సంబంధం లేకుండా పౌరులందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం-2006 వర్తిస్తుందని కీలక తీర్పునిచ్చింది. ముస్లిం మతం ప్రకారం తన కుమార్తెకు 15 ఏళ్లకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని ఓ తండ్రి వేసిన పిటిషన్ను న్యాయమూర్తి తోసిపుచ్చారు.
Similar News
News February 23, 2026
జనుము, అలసందతో భూమికి కలిగే మేలు

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.
News February 23, 2026
భారత్ బ్యాడ్ రికార్డ్

T20WC సూపర్-8లో సౌతాఫ్రికా చేతిలో 76 రన్స్ తేడాతో <<19212972>>ఓడిపోయిన<<>> భారత్ ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకుంది. T20 వరల్డ్ కప్లలో పరుగుల పరంగా టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద ఓటమి. 2010లో 49 రన్స్(vs AUS), 2016లో 47 పరుగుల(vs NZ) తేడాతో పరాజయం పాలైంది. అలాగే 2019 తర్వాత T20Iలలో ఇది రెండో బిగ్గెస్ట్ ఓటమి. చివరిసారిగా న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది.
News February 23, 2026
‘అతిథి దేవో భవ’ అంటే అర్థం ఇదే..

‘తిథి’ అంటే ఓ రోజు లేదా సమయం. అదేదీ లేకుండా అకస్మాత్తుగా ఇంటికి వచ్చేవారినే ‘అతిథి’ అంటారు. ఇప్పుడు ఉన్నట్లు పూర్వం సమాచార వ్యవస్థ విస్తృతంగా ఉండేది కాదు. కాబట్టి అతిథులు ఎప్పుడైనా వచ్చేవాళ్లు. అలాంటి అతిథిని దేవుడితో సమానంగా చూడాలనేదే ఈ సూక్తి భావం. తైత్తిరీయ ఉపనిషత్తులోని శీక్షావల్లిలో ఈ ‘అతిథి దేవో భవ’ అని పేర్కొన్నారు. అంటే తల్లి, తండ్రి, గురువు తర్వాత అతిథికి అంతటి ప్రాముఖ్యం ఇవ్వాలన్నమాట!


