News August 22, 2025
Dream 11పై బ్యాన్.. BCCI ఏమందంటే?

కేంద్రం తీసుకొచ్చిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్ నేపథ్యంలో భారత జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న డ్రీమ్ 11పైనా బ్యాన్ పడనుంది. దీనిపై BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ‘అనుమతి లేకపోతే స్పాన్సర్‌ను తొలగిస్తాం. కేంద్రం తీసుకొచ్చే ఏ పాలసీనైనా తప్పకుండా అమలు చేస్తాం’ అని స్పష్టం చేశారు. దీంతో సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం అయ్యే ఆసియా కప్‌లో స్పాన్సర్ లేకుండానే భారత జట్టు బరిలోకి దిగే అవకాశం ఉంది.
Similar News
News August 22, 2025
భారత్‌కు మద్దతు.. అమెరికా మాజీ NSA ఇంట్లో తనిఖీలు

INDపై ట్రంప్ టారిఫ్‌లను తప్పుబట్టిన US మాజీ జాతీయ భద్రతా సలహాదారు(NSA) జాన్ బోల్టన్ ఇంట్లో FBI తనిఖీలు చేపట్టింది. INDకు మద్దతు తెలిపిన మరునాడే ఇలా జరగడం గమనార్హం. తమ అధికారులు విధులు నిర్వర్తించారని, చట్టానికి ఎవరూ అతీతులు కాదని FBI డైరెక్టర్ కాష్ పటేల్ వెల్లడించారు. తనిఖీలు జరుగుతున్నా జాన్ వెనక్కి తగ్గలేదు. నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ ఉక్రెయిన్-రష్యాతో భేటీలు అవుతూనే ఉంటారని విమర్శించారు.
News August 22, 2025
త్వరలో అసెంబ్లీ సమావేశాలు!

TG: త్వరలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 25న జరిగే క్యాబినెట్ భేటీలో తేదీలు ఖరారు చేస్తారని విశ్వసనీయ సమాచారం. సమావేశాల సందర్భంగా కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక గురించి ముఖ్యంగా చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ నివేదిక రద్దు చేయాలని కోరుతూ కేసీఆర్ కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే.
News August 22, 2025
రేపు పలు జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో. జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలకు ఛాన్స్ ఉందని పేర్కొంది. మరోవైపు, ఆగస్టు 25 నాటికి ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.