News April 24, 2025

PSL ప్రసారంపై నిషేధం

image

మన దేశంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) ప్రసారంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పహల్‌గామ్‌లో ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. భారత్‌లో PSL‌ను స్పోర్ట్స్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్యాన్‌కోడ్‌ లైవ్ ఇస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో ఇవాళ్టి నుంచి PSL ప్రసారం ఆగిపోనుంది. భారత్ పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడబోదని ఇప్పటికే BCCI ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News April 25, 2025

ఉగ్రదాడిని పాకిస్థాన్ ఒప్పుకున్నట్లేనా?

image

ఉగ్రదాడిలో PAK హస్తముందని ఆరోపిస్తూ IND ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు పాక్ తీరు తప్పును ఒప్పుకున్నట్లే ఉంది. దాడి చేయకపోతే, చేయలేదని చెప్పకుండా ప్రతీకార చర్యలకు దిగింది. సరిహద్దులకు సైన్యాన్ని పంపి యుద్ధానికి సై అంటోంది. IND ఆరోపణలు అవాస్తమైతే దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సింది పోయి PAK వ్యవహరిస్తున్న తీరు దోషినని ఒప్పుకున్నట్లుగానే ఉంది.

News April 24, 2025

మేడిగడ్డ బ్యారేజీపై సంచలన నివేదిక!

image

TG: మేడిగడ్డలోని బ్లాక్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించాలని NDSA నివేదిక పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై అధ్యయనం చేసిన కమిటీ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. బ్యారేజీలలో నిర్వహణ లోపాలే సమస్యలు తెచ్చిపెట్టాయని తెలిపింది. మేడిగడ్డ బ్లాక్-7 ఎక్కువ దెబ్బతిందని, ప్రాజెక్ట్ వినియోగం ముప్పేనని తేల్చి చెప్పింది. నిర్మాణ లోపాలపై నిపుణుల పరిశీలన అవసరమని సూచించింది.

News April 24, 2025

6 మ్యాచుల్లో గెలుస్తామనుకుంటున్నాం: ఫ్లెమింగ్

image

ఈ సీజన్‌లో ప్లేఆఫ్ ఆశలపై CSK కోచ్ ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఆరు మ్యాచుల్లోనూ తాము గెలుస్తామని ఆశిస్తున్నామని చెప్పారు. కొందరు నవ్వుకున్నా గత ఏడాది ఆర్సీబీ ఇదే చేసిందన్నారు. రాబోయే మ్యాచుల్లో ఆటగాళ్లు అద్భుతంగా ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకవేళ వర్కౌట్ కాకపోతే పేలవ సీజన్ నుంచి నేర్చుకుంటామన్నారు.

error: Content is protected !!