News July 11, 2024

GOVT ఆఫీసుల్లో ఫర్నిచర్ కొనుగోలుపై నిషేధం

image

AP: ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రభుత్వం పొదుపు చర్యలు చేపడుతోంది. సచివాలయాలు, కలెక్టరేట్లు, HOD ఆఫీసుల్లో అన్ని రకాల ఫర్నిచర్ కొనుగోలుపై మే 31, 2026 వరకు నిషేధం విధిస్తూ ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ ఆస్పత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలు, కొత్తగా కట్టే ఆఫీసులు, రాజ్‌భవన్, హైకోర్టులకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని సీఎం, డిప్యూటీ సీఎం చెబుతున్న విషయం తెలిసిందే.

Similar News

News January 31, 2025

కేసీఆర్ కామెంట్స్‌పై కాంగ్రెస్ ఎదురుదాడి

image

TG: కాంగ్రెస్ పాలనపై మాజీ CM KCR చేసిన కామెంట్స్‌ను TPCC చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఆయన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కవితపై వస్తున్న మరో లిక్కర్ స్కాం ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఇన్నాళ్లు ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడిలా పడుకున్న KCR పంచాయతీ ఎన్నికల కోసమే బయటికొస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు.

News January 31, 2025

ఢిల్లీ ఎన్నికల ముందు ‘AAP’కు షాక్

image

మరో ఐదు రోజుల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు MLAలు రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో తమకు సీటు ఇవ్వలేదని వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో నరేశ్ యాదవ్, రాజేశ్ రిషి, మదన్ లాల్, రోహిత్, బీఎస్ జూనే, పవన్ శర్మ, భావన గౌర్ ఉన్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీలో ఎన్నికలు జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

News January 31, 2025

టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి!

image

భారీ బడ్జెట్‌తో సినిమాలు తీసి, అంతకంటే ఎక్కువ ధరకు డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించడం కామన్. అయితే, పెట్టిన డబ్బులతో పాటు లాభాలను అందించే సినిమాలు అరుదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఆ కోవలో చేరింది. ఈ చిత్రం ఇప్పటికే రూ.300 కోట్లు కలెక్ట్ చేయడంతో బయ్యర్లకు మంచి లాభాలొచ్చాయి. ఈక్రమంలో వీరంతా కలిసి చిత్రయూనిట్‌కు పార్టీ ప్లాన్ చేశారట. ఇలా జరగడం టాలీవుడ్‌లో తొలిసారని సినీవర్గాలు చెబుతున్నాయి.